హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ కు ఓ భారీ ప్యాలస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ భవనంపై గతంలో చాలా కథనాలు వచ్చాయి. దాదాపు 72 పడక గదుల్లో విలాసవంతంగా నిర్మించారని అప్పట్లో ఈ భవనం గురించి పుంఖానుపుంఖాలుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. 

ఇప్పుడు జగన్ ఆస్తుల అటాచ్ నేపథ్యంలో జగన్ కు చెందిన లోటస్ పాండ్ భవనం మరోసారి వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి ఇంత పెద్ద భవనం ఏపీ, తెలంగాణల్లోని ఏ రాజకీయ నాయకుడికీ లేదనే చెప్పొచ్చు. ఆ స్థాయిలో జగన్ తన ఇల్లు కట్టించుకున్నారు. అది కూడా గజం భూమి అరకోటిపైగానే పలికే బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతంలో ఈ భవనం ఉంది. 


ఐతే.. ఇప్పుడు ఈడీ అటాచ్ మెంట్ నేపథ్యంలో ఈ భవానికి చెందిన ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూస్తోంది. ఇది జగన్ సొంత భవనమే అంతా అనుకుంటారు. కానీ వైఎస్ జగన్ ఈ భవనానికి కూడా అద్దె కడుతున్నారట. అదేంటి సొంత భవనానికి అద్దె చెల్లించడమేంటని ఆశ్చర్యపోకండి. 


సామాన్య జనానికి ఇది జగన్ సొంత భవనంగానే కనిపిస్తున్నా రికార్డుల ప్రకారం ఇది ఉటోపియా ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ తో పాటు మరో రెండు సంస్థలకు చెందుతుందట. ఆయా సంస్థల నిధులతోనే ఈ భవనం కట్టారట. సో.. టెక్నికల్ గా ఈ ఇల్లు ఆయా సంస్థలకు చెందుతుందట. 

జగన్ వాటి నుంచి ఈ భవనాన్ని అద్దెకు తీసుకుని ఉంటున్నారట. ఈ భవనం అద్దె నెలకు దాదాపు 10 లక్షల రూపాయలట. అదీ జగన్ సొంతింటి అద్దె వ్యవహారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: