అవినీతి ని నిర్మూలిస్తాం అంటూ మోడీ ఇచ్చే లెక్చర్లు పనిచెయ్యడం లేదు, ముఖ్యంగా ఏపీ లో అవినీతి ని పూర్తిగా నాశనం చేస్తాం అనే చంద్రబాబు మాటలు నీటి మూటలే అని తేలిపోయింది. ఏపీ ని పెట్టుబడుల రాష్ట్రం గా మార్చాలి అని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలన్నీ తుంచేస్తూ రాష్ట్రం లో తీవ్రమైన అవినీతి జరుగుతోంది అని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకోనమిక్ రీసర్చ్ వారు చేసిన సర్వే ఆధారంగా చూస్తే ఆంధ్ర ప్రదేశ్ దేశం లోకెల్లా అవినీతి - లంచగొండి తనం లో రెండవ స్థానం లో ఉన్నాయి.

 

మొదటి స్థానం లో మన పక్క రాష్ట్రం తమిళనాడు ఉండడం విశేషం. ఈ సర్వే విడుదల చేసిన నివేదిక ప్రకారం పెట్టుబడులకి భారత్ మొత్తం లో అగ్ర స్థానం లో నిలిచింది గుజరాత్. గుజరాత్ లో పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు కళ్ళు మూసుకుని పెట్టేయచ్చు అని చెబుతోంది ఈ సర్వే. డిల్లీ పెట్టుబడుల విషయం లో రెండవ స్థానంలో ఉండగా తమిళనాడు మూడవ స్థానం , ఏపీ నాల్గవ స్థానం దక్కించుకున్నాయి. బీహార్ - జార్ఖండ్ రాష్ర్టాలు ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో ఉన్నాయి.

 

ఇక భూసేకరణ - పర్యావరణ అనుమతుల విషయానికి వస్తే  పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చుక్కలు చూపించేలా పరిస్థితులు ఉన్నాయని తేలింది. పెట్టుబడులకి మంచి రాష్ట్రాలు అయినా కూడా ఏపీ లో లంచాలు బాగా అడుగుతున్నారు అనీ ప్రతీ చిన్న పనికీ ఇక్కడ లంచం తో అవసరం ఉంది అనీ చెబుతున్నారు. పెట్టుబడులు వచ్చే రాష్ట్రం గా అవకాశాలు ఉన్నా కూడా ఈ లంచ గొండి తనం ఇబ్బంది పెట్టేస్తుంది అనీ ఈ లంచగొండుల వలన పెట్టుబడులకి ఆటంకం ఏర్పడుతుంది అనీ చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: