భారత దేశం గడ్డ మీద ఐఎస్ పెట్టిన మొదటి లక్ష్యం భాగ్యనగరం అయ్యుండేది. ప్రస్తుతం తెలంగాణా పోలీసులు వీరిని పట్టుకోబట్టి సరిపోయింది గానీ లేదంటే ఈ శని, ఆదివారాలలో తీవ్రమైన ముప్పు దిశగా హైదరాబాద్ నడిచేది. కేవలం రెండు రోజుల ముందర ఎన్ ఐ ఏ అధికారులు విజయవంతంగా దీన్ని భగ్నం చేసారు. సాధరణంగా గురు, శుక్రవారాలు తీవ్రవాదులకి చిచ్చు పెట్టే రోజులు. కానీ ఈసారి వారు శని , ఆదివారాలు ఎంచుకున్నారు.

 

గచ్చి బౌలి , హై టెక్ సిటీ ప్రాంతాల్లో శని - ఆదివారాలు వారాంతాల్లో పెద్దగా కార్యకలాపాలు ఉండకపోవడం వారంతా మాల్స్ లో ఎక్కువగా రావడం , సినిమాలకి వెళ్ళడం వలన ఈ రోజులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నగరం లో రద్దీ ఎక్కువగా ఉండే పోలీస్ స్టేషన్ లలో కూడా భద్రత మీద దృష్టి పెట్టి అక్కడ దాడి చెయ్యాలని వారు సిద్దం అయ్యారు. ఈ దాడుల కోసం , బాంబుల తయారీ కోసం రసాయనిక పదార్ధాలు హైదరాబాద్ లోనే కాక ఏపీ లోని ఎరువులు, పురుగుల మందుల షాపులలో కొన్నారు వీరు. బైకు మీద మహారాష్ట్ర వరకూ వెళ్లి అక్కడ 9 ఎం ఎం పిస్టల్స్ ని కొనుగోలు చేసారు. అత్యంత శక్తివంతమైన నలభై యాభై బాంబులు తయారీకి సిద్దంగా పెట్టారు వీరు.

వీరు ఇంటర్నెట్ ద్వారా దూరంగా ఉన్న ముఖ్య వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడుతున్నారు అని తెలుస్తోంది. ఏడాది నుంచీ వారి కదలికలు భారత్ లో ఎలా ఉందొ చూసిన ఇక్కడి ఎన్ఐఏ ఈ కుట్రని చేధించడానికి సరైన సమయం ఎంచుకున్నారు. భారత దేశం నుంచీ ఫేస్ బుక్ ద్వారా, ఫోన్ ల ద్వారా సిరియా కి వెళ్ళే ఫోన్ కాల్స్ మీద నిఘా పెట్టారు వారు. ఉగ్రవాద వెబ్సైటు ల మీద కూడా కన్నేసి ఉంచి వీరు వారితో మాట్లాడినవి అన్నీ ట్రాప్ చేసి మరీ పట్టుకున్నారు మన పోలీసులు. గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ని చంపడానికి ఐఎస్ ఉగ్రవాదులు పావులు కదిపినట్టు చెబుతున్నారు పోలీసులు.

 

ఆవు మాంసం తో మత కల్లోలం ..

 

 హనుమాన్ శోభ యాత్ర వంటి హిందూ ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉండే ఈ రాజా సింగ్ ని చంపడం వారి లక్ష్యంగా చేసుకున్నారు. మత కల్లోలాలు సృష్టించడం కోసం రంజాన్ నెలలో చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం తో సహా వివిధ దేవాలయాల్లో ఆవు మాంసం ఉంచాలి అని ఉగ్రవాదులు నిర్ణయం తీసుకున్నారట. సిరియాతో జరిపిన ఫోన్ సంభాషణలలో  ‘‘ఆరోజు నాలుగు ముక్కలు ఆవు మాంసం, ఐదు ముక్కలు గేదె మాంసం తీసుకురా. ఆ తర్వాతి రోజు ఏడు ముక్కలు ఆవు మాంసం తీసుకురా’’ అని ఒక ఉగ్రవాది మరొకడితో సూచించినట్లు ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: