గౌతమీపుత్ర శాతకర్ణి.. ఆంధ్రదేశంలోని అమరావతిని రాజధానిగా చేసుకుని మూడు సముద్రాల మధ్య వున్న సువిశాల సామ్రాజ్యాన్నేలిన చక్రవర్తి.. విదేశీ రాజులను సముద్రాల అవతలికి పారిపోయేలా తరిమికొట్టిన ధీరుడు.. కానీ ఇన్నాళ్లూ ఈ రాజు గురించి పెద్దగా చెప్పుకున్నది లేదు. ఏదో పోటీపరీక్షల్లో ఒక మార్కు బిట్టుగా మాత్రమే మిగిలిపోయాడు. 

కానీ ఇప్పుడు అమరావతి పునర్ నిర్మాణం వల్లనైతేనేమి.. గౌతమిపుత్ర శతకర్ణిగా బాలకృష్ణతో దర్శకుడు క్రిష్ సినిమా ప్రారంభించిన నేపథ్యం వల్ల నేమి.. గౌతమీపుత్ర శాతకర్ణి అంటే క్రేజ్ వచ్చింది. పబ్లిక్ కు ఏది ఇంట్రస్టో అదే చూపించాలి..ఇదీ ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 స్ట్రాటజీ.. అందుకే ఈ ఛానల్ కు కూడా ఇప్పుడు గౌతమీ పుత్ర శాతకర్ణి గుర్తొచ్చాడు.

( courtesy: tv9 )

అంతే అనుకున్నదే తడవుగా కాస్త పరిశోధన చేసి.. దాదాపు గంటన్నర స్టోరీ తయారు చేసి ప్రేక్షకుల గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను ముందే చూపించింది. ప్రోగ్రామ్ టైటిల్ కూడా గౌతమీ పుత్ర శాతకర్ణి అనే ఉంచడంతో ఈ ప్రోగ్రామ్ పై ప్రేక్షకుల అటెన్షన్ కూడా పెరిగింది.  ఈ స్టోరీ కోసం గౌతమీ పుత్రశాతకర్ణి చరిత్రకు సంబందించిన ఆనవాళ్లు పరిశోధించి, చరిత్రకారులు, ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారిని సంప్రదించి మొత్తానికి కథనం బాగానే వండారు. 

గౌతమీపుత్ర శాతకర్ణి కోసం రిపోర్టర్ ను మహారాష్ట్రలోని నాసిక్ కు పంపించి మరీ స్టోరీ చేయించింది టీవీ9. అక్కడి పాండవ లీన గుహల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ఆనవాళ్లు ఉన్నాయని సదరు రిపోర్టర్ తెలిపారు. గౌతమిపుత్ర శాతకర్ణి తవ్వించిన గుహలు, ఆయన తల్లి గౌతమీ బలసిరి తన కొడుకు గురించి రాసి వేయించిన శాసనం, గుహలోపల అమరావతి స్థూపాన్ని పోలిన భారీ స్తూపం, గౌతమిపుత్ర శాతకర్ణి ఆకారాన్ని పోలిన విగ్రహాలు చూపించారు. మొత్తానికి ప్రేక్షకులను నవైపు తిప్పుకోవడంలో తానే నెంబర్ వన్ అని టీవీ9 మరోసారి రుజువు చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: