అదేంటి ఒక ఎంపీ స్థానంలో ఉండి మరుగు దొడ్లను కడగడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా...? అవునండీ మీరు చదువుతున్నది అక్షారాలా నిజం. మాములుగా అయితే మన బాత్ రూమ్ లు మనమే కడుక్కోవడానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఒక పార్లమెంట్ సభ్యుడి స్థానంలో ఉండి మరుడుదోడ్లను కడగడం అంటే ఆషా మాషీ కాదుగా. కేవలం ఒక్క ప్రదేశంలోనే కాదండోయ్ ఆయన ఇలా చాలా ప్రదేశాలలోని టాయిలెట్లను పరిశుభ్రం చేశారట. ఇంతకీ ఎవరా ఎంపీ.. ఆయన ఆలోచనలేంటో ఆయన మాటల్లోనే....



మరుగుదొడ్లను శుభ్రం చేయడం సిగ్గుపడే పనికాదని, గర్వపడే పని అనిటీఆర్ఎస్ పార్టీ కి చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని పలు పాఠశాలల్లో టాయిలెట్లను శుభ్రం చేశారు. గొల్లపల్లి, ధర్మసాగర్ గ్రామాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేశారు. స్వచ్ఛ పాఠశాలల నిర్మాణానికి అందరూ కృషి చేయాలని విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. ప్రభుత్వ పాఠశాలలను శుభ్రంగా ఉంచడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఈ వాహనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.



గతంలో ఆయన చేవెళ్ల మండలంలోని 11 పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక టాయిలెట్స్ క్లీనర్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆయన ఆ వాహనాన్ని నడుపుకొంటూ ఆయా పాఠశాలలకు వెళ్లారు. ఈ ఆలోచన బాగుందని, దీనిని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కలెక్టర్ల సమావేశంలో మంత్రి కడియం చెప్పారని ఎంపీ వెల్లడించారు. నిజంగా ఇలాంటి ప్రజా ప్రతినిథిని అందరూ అభినందించాల్సిందే..!


మరింత సమాచారం తెలుసుకోండి: