నెల్లూరు లో అక్రమ భవనాల కూల్చివేత అంశం ఇప్పుడు తెలుగు దేశం పార్టీ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలూ కూల్చేయ్యాలి అని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేసిన మేరకు ఈ ఆపరేషన్ మొదలైన నాలుగు రోజుల వ్యవధి లోనే బెడిసి కొట్టింది. ప్రతిపక్ష వైకాపా  పార్టీ అక్కడ చాలా సీరియస్ గా ఆందోళన కి సిద్దం అయ్యింది. సొంత పార్టీ తెలుగు దేశం లో కూడా ఈ విషయం లో చాలా అవాంతరాలు ఎదురు వుతున్నాయి.

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పార్టీ వైకాపా కి భలే అస్త్రం దొరికినట్టు అయ్యింది. వైకపా చొరవ తో తాత్కాలికంగా పనులు ఆపెసినట్టు తెలుస్తోంది. నెల్లూరు సిటీ ఇంకా రూరల్ ప్రాంతాల్లో నియోజికవర్గాల్లో ని టీడీపీ ముఖ్య నేతల మధ్యన ఉన్న అంతర్గత వివాదాల వ్యవహారం చివరకి అక్రమ కట్టడాలని కూల్చి వేసే దిశగా సాగింది. రెండు సంవత్సరాల వ్యవధి లోనే తెలుగు దేశం హయాం లో విపరీతంగా అవినీతి పెరిగింది అని మేయర్ అజీజ్ తో పాటు ఆయన తమ్ముడు జలీల్ అండతో దాదాపు 300 అక్రమ భవనాలు వెలిసాయి అని టీడీపీ నేతలే స్వయంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు.

ఇలాగే ఉంటె పార్టీ ప్రతిష్ట జనం లో కోల్పోతుంది అని వారు హెచ్చరిస్తున్నారు. ఏసీబీ దాడులు చేసిన తరవాత అజీజ్ , ఆనం వివేకా ఒకరిమీద ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం , పత్రికల కి ఎక్కిమరీ వాదులు ఆడుకోవడం తో హైకమాండ్ వీరికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మేయర్ అజీజ్ రెండు సంవత్సరాల పాలన నగరం లో దాదాపు 300 అక్రమ భవనాలు వెలవడానికి కారణంగా మారింది. అజీజ్ మీద అసంతృప్తి తో ఉన్న మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ వ్యవహారాలకి చెక్ పెట్టి భవిష్యత్తు లో అయినా పార్టీ కి మంచి పేరు తేవాలి అనే ఉద్దేశ్యం తో అవన్నీ కూల్చేయ్యాలి అనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి అజీజ్ తీవ్రంగా ఎదురు తిరిగి సీరియస్ అయ్యారు. 

 

మేయర్‌కు ముకుతాడు వేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చేయడం కోసం మంత్రి నారాయణ ఇటీవల కార్పొరేషన్‌ అధికారులకు క్లాస్‌ తీసుకున్నారు. తనకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దనీ, మేయర్‌ చెప్పినా తన దష్టికి తేవాలని కమిషనర్, ఇతర అధికారులకు మంత్రి నేరుగానే చెప్పారు. అజీజ్ ని కట్టడి చెయ్యడం అంటే అవన్నీ కూల్చేయ్యడమే అనే ఉద్దేశ్యం లో ఉన్న మంత్రి కూల్చేవేత అస్త్రం ప్రయోగించారు. ఈ టైం లో వైకపా కార్పరేటర్ లు జనాలకి అండగా నిలిచారు. రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి , సిటీ ఎమ్మెల్యే అనిల్ తో సహా చాలా మంది ప్రత్యక్షంగా ఆందోళన చేస్తాం అని బెదిరించడం తో వైకపా వ్యవహారం మొత్తం తమకి అనుకూలంగా మార్చుకుంటోంది అని గ్రహించిన తెలుగు దేశం ఇప్పుడు సైలెంట్ గా తమ శైలి మార్చుకుంటోంది అని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: