పెళ్ళయిన ఆడవారికి మొగుడి తాగుడు వ్యవహారం పెద్ద తలనొప్పి. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ కష్టపడిన భర్త ఇంట్లోకి సరుకులు, పిల్లలకి ఫీజు డబ్బులూ, పెద్దవాళ్ళకి మందులూ తేవడం మానేసి సంపాదించిన డబ్బు మొత్తం తాగుడు మీద ధారపోస్తూ ఉంటే ఆడవారికి ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. లిక్కర్ విషయం లో ప్రభుత్వం ఎప్పుడో చేతులు ఎత్తేసింది ప్రధాన ఆదాయ వనరు అవ్వడం తో తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఎదేచ్చ గా ఏరులై పారుతోంది.దీంతో భార్యలకి మొగుళ్ళని కట్టడి చేసే చాన్స్ అనేదే లేకుండా పోయింది.

 

చెప్పీ చెప్పీ చెప్పీ భార్యలు నిజంగా విసిగిపోతున్నారు. తాగుడు మానెయ్యాలి , మానడం వలన తమ జీవితాలు బాగుపడతాయ్ అని మొగుడు ఎంత చెప్పినా వినకపోవడం తో ఒక భార్య అతని కళ్ళలో ఏకంగా ఫెవీక్విక్ పోసేసిన ఘటన సంచలనం రేపుతోంది. సంతోష్ విశ్వకర్మ అనే ఒక తాగుబోతు జీవితం ఇది. ప్రతీ పూటా ఫుల్లుగా తాగి వస్తూ ఉంటాడు ఆయన భార్య విజయలక్ష్మి ఎంత చెప్పినా మనోడు వినేవాడు కాదు. ఉదయం రాత్రీ అనే తేడా లేదు, ఒక్కొక్కసారి ఉద్యోగానికి శలవు పెట్టి మరీ తాగుడు మీద కాన్సంట్రేషన్ పెడుతూ ఉంటాడు. అలాంటి సంతోష్ విశ్వకర్మ ఒకరోజు రాత్రి ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడు. తెల్లారే సరికి అతని కళ్ళు ఓపెన్ అవ్వడం లేదు. ఎంత తెరవాలి అని చూసినా అవి తెరుచుకోవడం లేదు.

 

భార్య ని గట్టిగట్టిగా అరుస్తూ పిలిచాడు అయితే అతని అరుపులు ఆమె అస్సలు పట్టించుకోలేదు. నీళ్ళతో కళ్ళు శుభ్రం చేసుకుందాం అని వాటర్ బేసిన్ వరకూ వెళ్ళాడు కానీ ఫలితం లేదు అతనికి. గావుకేకలు పెడుతున్న అతనికి సహాయం చేసేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించారు. అయితే ఫెవిక్విక్ పవర్ తో కళ్లు తెరవలేదు. పోలీసులకి సమాచారం ఇవ్వగా వారు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ పరిశీలించి కళ్ళలో ఫెవీక్విక్ ఉంది అని చెప్పి వైద్యం చేసారు. ఇప్పుడు సంతోష్ కళ్ళు ఎలాంటి ఇబ్బందీ లేకుండా తెరుచుకుంటున్నాయి. హమ్మయ్య అనుకున్న సంతోష్ ఇంటికి వెళ్లి పెళ్ళాన్ని చితక్కోడదాం అనుకున్నాడు ఆమె అతని దెబ్బలు గుర్తుకు వచ్చి ఏటో పారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: