సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమా గురించి యావత్ ప్రపంపం ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న కబాలి చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంతకంటే 20 గంటల ముందే అమెరికాలో  తమిళ, తెలుగు భాషల్లో కబాలి ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కబాలి సినిమా గురించి కొన్ని షాకింగ్ న్యూస్ తెలుసుకుందాం..  


1. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4వేలకు  పైగా థియేటర్లలో విడుదలవుతోంది. 
2. ప్యారిస్ లో రెక్స్ థియేటర్ లో 2800 సీట్లున్న భారీ హాల్ లో కబాలి చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. 
3. తమిళ, తెలుగు, హిందీ, చైనీస్, థాయ్, జపనీస్, మలై భాషల్లో విడుదలవుతోంది.  



4. విడుదలకు ముందే  200 కోట్ల వ్యాపారం జరిగిపోయింది.
5. విమానంపై పోస్టర్ వేయించుకున్న తొలి సినిమా కబాలియే.
6. ఎయిర్ టెల్, అమెజాన్, క్యాడ్ బరీలతో పాటు 100 కంపెనీలు కబాలి పేరుతో వ్యాపారం చేస్తున్నాయి. 
7. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ రజినీ కబాలి గెటప్ తో ప్రత్యేక బంగారు, వెండి నాణేలను అమ్ముతోంది. 


8. చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ లోనూ కబాలి టీ షర్ట్స్ అమ్ముడుపోతున్నాయి. 
9. రికార్డు స్థాయిలో 250 థియేటర్లలో 450 స్క్రీన్లపై ప్రీమియర్ షోలు వేస్తున్నారు. 
10. రజనీకాంత్ కటౌట్లకు 50 వేల లీటర్ల పాలాభిషేకం చేస్తారట.



మరింత సమాచారం తెలుసుకోండి: