ఇది నిజంగా హైదరాబాద్ వాసులకీ, భారతీయులకీ అతిపెద్ద శుభవార్త. ప్రముఖ మోడల్ రోహిత్ ఖండేవాల్ మిస్టర్ వరల్డ్ టైటిల్ ని తన ఖాతాలో వేసుకునాడు .అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్టర్ వరల్డ్ 2016 గెలుచుకోవడం మామూలు విషయంకాదు అంటున్నారు విశ్లేషకులు. ప్రపంచ నలుమూలల నుంచీ ఈ ఫైనల్ కి దాదాపు 46మంది రాగా వారందరినీ పక్కకి తోసి ప్రపంచ విజేత అయ్యాడు ఇతను. ఈ అవార్డ్అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఇతనే. ఇంగ్లాండ్ లోని సౌత్ పోర్ట్ లోజరిగిన ఫైనల్స్ లో 26 సంవత్సరాల రోహిత్ ఈ టైటిల్ ని దక్కించుకున్నాడు.


అంతే కాకుండా దాదాపు యాభై వేల డాలర్లు అంటే మన లెక్కల్లో 35 లక్షల క్యాష్మనీ కూడా గెలుచుకున్నాడు. మిస్టర్ వరల్డ్ గా నిర్వాహకులు రోహిత్ పేరుచెప్పిన వెంటనే రోహిత్ తాను ఈ ఆనందాన్ని నమ్మలేకపోతున్నాను అని చెప్పుకొచ్చాడు. టైటిల్ సాధించిన మొట్ట మొదటి భారతీయుడు తానే కావడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు అతను .ఈ టైటిల్ దెబ్బతో తన కల సాకారంఅయ్యింది అనీ ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం తనకి ఎప్పుడూ తోడుగా ఉన్న మిస్ఇన్దిఆ సంస్థ కి ప్రత్యెక కృతజ్ఞతలు చెబుతున్నాను అని రోహిత్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: