భారత చైనా సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్తత ఉండడం మామూలు విషయమే కానీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లాంటి వార్తలు వినిపిస్తున్నాయి, ఈ సరిహద్దు ప్రాంతం దాదాపు 826 కిలోమీటర్ల మేరకు వాస్తవాధీన రేఖ గా పిలుస్తారు . ఇక్కడ మొత్తం భారీ ఎత్తున భారత సైన్యం యుద్ధ ట్యాంకర్ లు మోహరించింది. ఈ విషయం లో చైనా సీరియస్ గా ఉంది. రెండు దేశాలకీ మధ్యన ఒప్పందం ఉండడం తో ఈ విషయం లో చైనా స్పందించింది.

 

 ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి లూ కాంగ్ మాట్లాడుతూ శాంతి ప్రక్రియ విషయం లో రెండు దేశాలకీ ఒక ఒప్పందం ఉంది అనీ అది మర్చిపోకూడదు అనీ పేర్కొన్నారు ఆయన. చైనా మీడియా ఈ విషయం లో చాలా సీరియస్ గా మాట్లాడుతోంది. భరత్ లో చైనా పెట్టె పెట్టుబడుల విషయం లో ఈ చర్య చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది అని చైనా మీడియా అంటోంది. రెండు రోజుల క్రితం ఎన్డీటీవీ ఒక ప్రత్యెక కథనం ప్రసారం చేసింది అందులో భారత్ దాదాపు 100 యుద్ధ ట్యాంకులు మోహరించింది అని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు అది చైనా వారి కంట్లో పడింది.

 

చైనా అధికార వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ దీని మీద కథనం రాసింది. భారత్ కావాలనే కవ్వింపు చర్యలకి పాల్పడుతోంది అనీ దీని వలన భారత్ లో పెట్టె పెట్టుబడుల విషయం లో చాలా ఇబ్బందులు పేర్కొనాల్సి ఉంటుంది అనీ చెబుతోంది ఆ దేశ మీడియా. ఒకవైపు సరిహద్దుల్లో యుద్ధ టాంకర్ లు ఇష్టం వచ్చినట్టు మొహరిస్తూ నే మరొక పక్క పెట్టుబడుల కోసం  ఎందుకు మా దేశం వైపు చూస్తున్నారు అంటూ ఆ దేశ మీడియా సీరియస్ అవుతోంది.

మరొక పక్క చైనా తమ భూభాగంగా చెబుతున్న భారత్ లోని ప్రాంతం లోనే భారత సైన్యం పెద్ద ఎత్తున దళాలు మోహరించింది అనే మన మీడియా చెబుతోంది. వచ్చే కొద్ది నెలల్లో భారీగా జవాన్లని కూడా అక్కడే మొహరించాలి అని భారత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. భారత్ లో చైనా పెట్టిన ఐదు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులకి ఇది నష్టం తెప్పించే ఛాన్స్ ఉండచ్చు. వాస్తవాధీన రేఖ గుండా పెట్రోలింగ్ చేసే భారత చైనా దళాలు పరస్పరం ఎదురు అవుతూ ఉండడం తో అన్నిటికీ సన్నధంగా ఉండడం కోసం ఇవి మొహరించారు అని భారత్ సైన్యానికి చెందినవారు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: