ప్రస్తుతం ఈ శుభవార్త తో పాలమూరు జిల్లా ప్రజలు ఖుషీ ఖుషీ గా ఉన్నారు. తమ జిల్లా చరిత్ర లో ఒక కొత్త శకం మొదలైంది అని వీరు అనుకుంటున్నారు. పల్లెర్లు మొలిచిన నెల మీద పచ్చ పచ్చని భవిష్యత్తు కనిపిస్తూ ఉండడం తో వారు తెగ సంతోష పడుతున్నారు. నిన్నటి దాకా జిల్లా కే రాని కృష్ణా నది ఇపుడు కాల్వ గేట్లు తోసుకుంటూ వచ్చి ఆ ఊరి నేల మీద పడుతోంది. పాలమూరు మొత్తం ఇక గొప్ప జిల్లాగా మారబోతోంది.

 

 వలసల జిల్లాగా ఇప్పటి వరకూ పేరు గాంచిన ఈ జిల్లా ఇప్పుడు నీరుతో మురిసిపోతోంది. లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ లు మొదలు పెట్టిన తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ లతోనే ఆ జిల్లాని సస్యశ్యామలం చెయ్యబోతోంది. ఈ జిల్లాని ఎంతో మంది దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం అన్నారు గానీ ఇప్పటి వరకూ ఒరిగింది లేదు. కానీ పాలమూరు భవిష్యత్తు తలరాతని మారుస్తూ ఇప్పుడు ప్రాజెక్ట్ లు ఇక్కడ అంకురార్పణ జరిగాయి ముఖ్యమంత్రి కెసిఆర్ శకం మొదలైంది అనీ ఇక ప్రజలకీ, రైతులకీ కష్టాలు ఉండవు అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెబుతున్నారు.

 

దశాబ్దాలు గా జనం ఎదురు చూసిన ప్రాజెక్ట్ అని తాము మొదలు పెడుతున్నాం అనీ ఇదే స్ఫూర్తి ని తీసుకుని పాలమూరు , రంగారెడ్డి పథకాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాం అని ఆయన మాట ఇచ్చారు " ఈ జిల్లాకి ఇప్పటి వరకూ వలసల జిల్లా గా పేరుంది. ఇక నుంచి వలసు అనేవి ఉండవు, పూర్తిగా ఆగిపోతాయి. పైగా ఈ జిల్లా రైతుల పనితీరు ని ప్రపంచం మెచ్చుకుంటుంది. పక్క జిల్లాల వారు ఈ జిల్లాకి పని కోసం వలస వచ్చే రోజులు దగ్గర లోనే ఉన్నాయి " అంటూ అందరి ముందరా చెప్పారు హరీష్ రావు. భీమా ఫేజ్ 1 కి పక్కన ఏర్పాటు చేసిన రామన్ పాడు కాలవ కి నీరు విడుదల చేసారు మంత్రి. బహిరంగ సభలో పాల్గొన్న హరీష్ రావుని చూడడం కోసం వేలాది మంది తరలి వచ్చారు " ముఖ్య మంత్రి కెసిఆర్ కారణంగా ఈ రోజు ఈ జిల్లాకి ఇరవై లక్షల నీళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయ్యం , ఖరీఫ్ సీజన్ కి నెట్టంపాడు నుంచే లక్షన్నర ఎకరాలకి నీరు ఇస్తాం " అని హరీష్ రావు ప్రకటించారు


మరింత సమాచారం తెలుసుకోండి: