కార్య నిర్వహణలో కెటిఆర్ చాలా శక్తివంతుడని, పార్టీ నాయకులకే కాదు అధికార యనత్రాంగానికి ఎలాంటి తప్పించుకొనే వీలులేకుడా వాటికి తావివ్వకుండా అదేశాలను నిక్కచ్చిగా ఇస్తాడని పేరు. ఆయన మూడువారాల విదేశీ పర్యటన ముగించుకొని ఫ్రెష్ గా హైదరాబడ్ లో అడుగు బెట్టగానే టివి 9 రోడ్ల దుస్థితిపై 50 నిమిషాల ప్రసార నిడివి ఉండే లైవ్ ని ప్రసారం చేసింది.



 

కెటిఆర్ ప్రజల దుస్థితి గమనించి, శ్రీనగర్ కాలనీ లాంటి ప్రదేశాలు పర్యటించి అధికారలకు అదేశాలు కొంచెం కఠినంగానే జారీచేశారు ప్రజా సముఖంగానే. పలు ప్రభుత్వ శాఖలమద్య సమన్వయం కొరవడిండని ఎత్తిచూపారు కూడా! భవిష్యట్ లో ఈ పరిస్థితి రాకూడదని నగర మేయర్ గారిసముఖానికి కూడా సెలవిచ్చారు హైదరాబాద్ నగర పాలక సంస్థకు. ఆ రోడ్ల స్థితిగతులు గమనించిన విషయం కూడా అనేక టివి చానళ్ళు, ప్రింట్ మీడియా కూడా ఈ దుస్థితిపై ఫోకస్ చేశాయి.




విశ్వనగరం కాదు హైదరాబాద్ హైదరాబాద్ లాగా ఉంచితే మాకు చాలు మహాప్రభో! బాబూ విశ్వనగరం మేము కోరుకోవటంలెదని అంతర్జాలం సాక్షిగా జనం కూడా కోడై కూసింది. ఇదంతా జరిగి కూడా మరోపది రోజులైంది. బాహుబలి లాంటి కేటీఆర్ నోటి నుంచి ఆదేశాలు వచ్చినంతనే శరవేగంతో పనులు జరిగిపోతాయని. హైదరాబాద్ రహదార్ల సమగ్ర స్వరూపమే మారిపోతుందని ప్రజలు ముచ్చటపడ్డారు. పదిహేను పై బడ్డా ఇంకా, రోజులు గడుస్తున్నా ఎలాంటి మార్పు లేకపోవటం ఒక ఎత్తు అయితే, ఈ కాలగమనం లో రహదార్ల పరిస్థితి అంతకంతకూ దయనీయంగా దారుణంగా మారుతున్న పరిస్థితి, దుస్థితి ని నగర ప్రజ అనుభవిస్తుంది. సాక్షి చానల్ కూడా బహుముఖంగా నగర దుస్థితి దుశ్యం నిన్న చూపించింది.




దీన్నిబట్టి నగరపాలక సంస్థకు బాహుబలి లాంటి కెటిఆర్ అంటే పూచికపుల్ల తో సమానమని తేలింది. అయినా నాయకులు, మంత్రుల జాతకాలు అధికారల కెరుకలేకనా? ఆయువు పట్లన్నీ తెలిసిన అధికారులకు ఆదేశాలు చాలవనీ, బాబ్బాబు అని బ్రతిమిలాడాలని బాహుబలికి తెలియదు. అందుకే పనులు జరగట్లేదు. ఫైనల్ గా మనం శివగామి లాంటి "నా మాటే శాసనం" అనగల రాజకీయ ధురంధరుడు కేసిఆర్ సారు కు విన్నవించుకోవాలేమో? మీడియా బాబులారా దయచేసి ఆ పని కూడా చేసిపెట్టండి దొరా అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారోచ్.  



మరింత సమాచారం తెలుసుకోండి: