తంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో 29 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం శుక్రవారం మధ్యాహ్నం గగనతలంలో అదృశ్యమైంది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు.



ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. కనబడకుండా పోయిన విమానం ఆచూకీ కనిపెట్టేందుకు ఎయిర్ ఫోర్స్, నావికా దళం సేనలు రంగంలోకి దిగాయి. విమానం అదృశ్యమై ఇప్పటికి ఆరు గంటలు దాటడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా దీనికోసం గాలింపు జరుపుతున్నాయి. బంగాళా ఖాతంలోని పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. 



ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు. ఇప్పుడు ఈ విమానం అదృశ్యం కావడం వెనుక సాంకేతిక కారణాలే ఉన్నాయా, మరేదైనా సమస్య ఉందా అని విచారణ జరపాల్సి ఉంది. అదృశ్యమైన విమానం కోసం ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్ఢ్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. విమానం బంగాళాఖాతంలో కూలిందేమో తెలుసుకోవడానికి నేవీ నిఘా విమానాన్ని పంపించింది. నాలుగు నౌకలను కూడా ఆ దిశగా పంపించారు. ఏఎన్ 32 విమానాలు ఐఏఎఫ్ దగ్గర 100 వరకు ఉన్నాయి. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే ఈ విమానం నాలుగు గంటలపాటు నిర్విరామంగా ఎగరగలదు. పోర్ట్ బ్లెయిర్, చెన్నై రెండు వైపుల నుంచి సెర్చ్ ఆపరేషన్లు మొదలుపెట్టామని, సాధ్యమైనంత త్వరగా విమానం ఆచూకీ కనుగొంటామని ఎయిర్ ఫోర్స్ పీఆర్వో కెప్టెన్ డీకే శర్మ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: