71 దేశాల్లో కంపెనీలు.. వేల కోట్ల ఆస్తులు.. కంపెనీలో ప‌నిచేసే ఉద్యోగుల‌కే బోన‌స్ కింద కార్లు, ఇళ్లు ఇచ్చిన ఘ‌న‌త‌.. చిన్నప్ప‌టి నుంచీ క‌ష్ట‌మంటే ఏంటో తెలియ‌కుండా పెరిగాడు. కానీ నెల రోజుల పాటు ఓ సాధారణ వ్యక్తిలా కేరళలో కొచ్చిలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ గడిపాడు 21 ఏళ్ల డ్రావ్యా ఢోలాకియా. దీనికి కార‌ణం అత‌ని తండ్రే. వేల కోట్ల ఆస్తికి వార‌సుడు.. మావాడికి ప‌నిచేయాల్సిన క‌ర్మేంట‌ని అనుకుంటారు చాలామంది కోటీశ్వ‌రులు. కానీ హ‌రే క్రిష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్ ఓన‌ర్ సావ్‌జీ ఢోలాకియా మాత్రం భిన్నంగా ఆలోచించారు. త‌న కొడుకుకు జీవిత‌మంటే ఏంటో తెలిసేలా చేయాల‌నుకున్నారు. ఓ నిరుపేద ఓ చిన్న ఉద్యోగం సంపాదించ‌డానికి ఎన్ని క‌ష్టాలు ప‌డుతాడో త‌న కొడుకు తెలుసుకోవాల‌ని కోరుకున్నారు. ఏ యూనివ‌ర్సిటీ ఇలాంటి జీవితపాఠం చెప్ప‌దు.. కేవ‌లం స్వానుభ‌వం మాత్ర‌మే చెబుతుందంటూ కొడుకు డ్రావ్యా ఢోలాకియాను ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించారు.
కొడుక్కి వింత పరీక్ష పెట్టిన బిలియనీర్!


సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకును నెలరోజుల పాటు సామాన్యుడిలా జీవించమని సావ్‌జీ ఆదేశించాడు. జూన్ 21న మూడు జతల బట్టలు, రూ.7 వేలు ఇచ్చి వెళ్లమన్నారు. తాను ఇచ్చిన డబ్బు అత్యవసర సమయాల్లో మాత్రమే వాడాలని, ఫోన్ వినియోగించరాదని షరతులు విధించాడు. అందుకే అత‌ను కొచ్చిని ఎంచుకున్నాడు. అయితే వ‌చ్చిన కొన్ని రోజుల‌కే జీవితం పెట్టే ప‌రీక్ష‌లు ఎలా ఉంటాయో డ్రావ్యా తెలుసుకున్నాడు. ఐదు రోజులు ఎలాంటి జాబ్ లేదు. ఎక్క‌డ ఉండాలో తెలియ‌దు. కొత్త ముఖం కావ‌డంతో ఎవ‌రూ జాబ్ ఇవ్వ‌లేదు. గుజ‌రాత్‌కు చెందిన ఓ నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని అబ‌ద్ధం చెప్పినా ఫ‌లితం లేక‌పోయింది. తండ్రి ఆదేశాల మేరకు కొచ్చి చేరుకున్న ద్రావ్య మొదట బేకరిలో చేరాడు. తర్వాత కాల్ సెంటర్, చెప్పుల దుకాణం, మెల్డొనాల్డ్ అవుట్లెట్ లోనూ పనిచేశాడు. నెల రోజుల్లో రూ. 4 వేలుపైగా సంపాదించాడు. తండ్రి పెట్టిన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుని మంగళవారం ఇంటికి తిరిగొచ్చాడు.



ఇంటి నుంచి పంపేటప్పుడు ద్రావ్యకు మూడు షరతులు పెట్టాను. సొంతం పనిచేసి డబ్బు సంపాదించుకోవాలి. నా పేరు ఎక్కడా వెల్లడించకూడదు. మొబైల్ ఫోన్ వాడకూడదని షరతులు విధించాను. ఇంటి నుంచి తీసుకెళ్లిన  ఏడు వేల రూపాయలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలని చెప్పాను. ఉద్యోగాలు, డబ్బు సంపాదనకు సామాన్యులు పడుతున్న కష్టాల గురించి నా కుమారుడు తెలుసుకోవాలని ఇదంతా చేశాను. జీవిత పాఠాలు ఏ యూనివర్సిటీలోనూ చెప్పరు. అనుభవాన్ని మించిన పాఠం లేద'ని సావ్‌జీ ఢోలకియా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: