ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలి.. కానీ కొట్టినట్టు కనిపించకూడదు... పోటీదారుడు నష్టపోవాలి.. కానీ మనం నష్టం చేసినట్టు ఉండకూడదు.. మరి ఏం చేయాలి.. నిబంధనలు అడ్డగోలుగా మార్చేయాలి.. మనకు అనుకూలంగానే నిబంధనలు రూపొందించాలి. మన ప్రత్యర్థులు నష్టపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇదీ రాజకీయమంటే.

ఇప్పుడు చంద్రబాబు అదే చేశారు. ఏపీలో రాజకీయ పార్టీల స్థలాల కేటాయింపుల్లో నిబంధనలు సవరిస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల తయారీ చంద్రబాబు తన మార్కు చూపించారు. కేవలం టీడీకి మాత్రమే ఎక్కువ భూములు దక్కేలా.. వైసీపీకి నామమాత్రంగా భూములు ఇచ్చేలా ప్రత్యేకంగూ నిబంధనలు రూపొందించారు. 


కొత్త రూల్స్ ప్రకారం..  అసెంబ్లీలో 50శాతం కంటే ఎక్కువ సభ్యులున్న పార్టీలకు రాజధాని ప్రాంతంలో 4ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో 2ఎకరాల స్థలం కేటాయిస్తారు. అంటే అధికార పార్టీకి అన్నమాట. ఇక  25శాతం నుంచి 50శాతం సభ్యుల బలమున్న పార్టీలకు రాజధాని ప్రాంతంలో అర ఎకరం,  జిల్లా కేంద్రాల్లో వెయ్యి గజాలు స్థలం కేటాయిస్తారు. అంటే వైసీపీకి అన్నమాట. 

కనీసం ఒక ఎమ్మెల్యే అయినా ఉండి 25శాతం కంటే తక్కువ సభ్యులు ఉన్న రాజకీయ పార్టీలకు రాజధాని ప్రాంతంలో వెయ్యి గజాలు, జిల్లా కేంద్రాల్లో 300గజాలు స్థలం ఇస్తారు. ఈ రూల్ బీజేపీ కోసమన్నమాట. ఈ స్థలాలు 33ఏళ్ల పాటు లీజుకు ఇస్తారు. 99ఏళ్ల పాటు లీజును పొడింగించుకునే అవకాశం కూడా కల్పించారు. చూశారుగా టీడీపీకి మాత్రమే లాభించేలా రూల్స్ ఎలా ఫ్రేమ్ చేయించారో.. బాబా.. మజాకా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: