ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరమైన విశాఖ జిల్లాలో ప్రభుత్వం భారీగా  భూకేటాయింపుల ఉత్తర్వులిచ్చింది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో 740.82 ఎకరాలను ఎడ్యుకేషన్ సిటీ కోసం ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖకు ఉచితంగా కేటాయించింది. ఇక్కడ ఎకరాల 12 లక్షల రూపాయిల మార్కెట్ ధరకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ సిఫారసు చేశారు.

ఈ మొత్తం భూమిని ఉచితంగా ఉన్నత విద్యా శాఖకు కేటాయించింది. అక్కడ సంస్ధలను నెలకొల్పేందుకు వచ్చిన వారి దగ్గర నుంచి ఎంత రుసుం వసూలు చేయాలన్నది నిర్ణయిస్తామని ఉత్తరువులలో వివరించింది. ఇక్కడ ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో పాటు, అంతర్జాతీయ విద్యా సంస్ధలను సాంకేతిక వృత్తి విద్యా జాతీయ సంస్ధలను నెలకొల్పేందుకు అవకాశమిస్తారు. 


అచ్యుతాపురం మండలంలో పారిశ్రామిక సెజ్  కోసం వివిధ గ్రామాలలో భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తరువులు ఇచ్చింది. దిబ్బపాలెం గ్రామంలో ఎపిఐఐసి 92.44 ఎకరాలు, ఇదే మండలంలో మారుటేరు గ్రామంలో 117.46 ఎకరాలు, మరోసర్వే నెంబర్ లో 10.97 ఎకరాలను సెజ్ కోసం కేటాయించారు. ఈ మండలంలోనే 114.75 ఎకరాలను వెదురు వాడ గ్రామంలో ప్రభుత్వం ఎపిఐఐసి కేటాయించింది. 

ఈ భూములన్నింటికి 2.95 లక్షల రూపాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. చిప్పాడ గ్రామంలో 107.87 ఎకరాలు, జంగులూరులో 373.61 ఎకరాలను కూడా ఎకరాల 2.95 లక్షల రూపాయిలకే ఎపిఐఐసి కేటాయించింది. నర్సీపట్నం మండలం చెట్టుపల్లి లో 1.61 ఎకరాలు లను ఎకరాల ఐదు లక్షల రూపాయిల చొప్పున, రాంబిల్లి మండలం చాట మెట్ట గ్రామంలో 7.96 ఎకరాలను ఎకరాల 8లక్షల రూపాయిల చొప్పున ఎపిసెజ్ కోసం ఎపిఐఐసి చెల్లించాల్సి  ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: