హరితహారం కార్యక్షికమం అమలు తీరును ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజావూపతినిధులు, అధికారులంతా ఈ కార్యక్షికమంలో యుద్ధంచేసే రీతిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వారందరి పనితీరుకు హరితహారం కార్యక్షికమమే గీటురాయిగా ఉంటుందని కేసీఆర్ స్పష్టంచేశారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హరితహారం కార్యక్షికమంలో ఉండాలన్నారు.

kcr-Harithaharam


 హరితహారం కార్యక్రమంపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మంత్రి హరీశ్‌రావు, ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, సీనియర్‌ అధికారులు ఎస్‌.కె.జోషి, రామకృష్ణారావు, నవీన్‌ మిట్టల్‌ పాల్గొన్నారు. జిల్లాల ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్న కొంతమంది మంత్రులతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. హరితహారం పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాల నుంచి తెప్పించుకున్న క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు, మంత్రులకు సూచనలు చేశారు.



జిల్లా, నియోజకవర్గం, మండలం ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించుకుని హరితహారం కార్యాచరణను అమలు చేయాలని అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్లు కూడా హైదరాబాద్ తరహాలో డివిజన్ల వారీగా ప్రణాళికలు రూపొందించుకుని, వాటిని సీఎస్‌కు పంపాలని ఆదేశించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలున్నాయని, పంటలు బాగా పండుతున్నాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని మొక్కల పెంపకానికి ఉపయోగించుకోవాలని సూచించారు. 

హరితహారమే గీటురాయి


ప్రజా ప్రతినిధులు, అధికారులు జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రణాళిక రూపొందించుకుని కార్యాచరణ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లుకూడా హైదరాబాద్ తరహాలో డివిజన్ల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఈ ప్రణాళికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలు వస్తున్నాయని అన్నారు. పంటలు కూడా బాగా పండుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి సానుకూల వాతావరణాన్ని మొక్కల పెంపకానికి బాగా ఉపయోగించుకోవాలని సూచించారు. పెట్టిన మొక్కలు ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోకుండా చూసుకోవాలని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: