ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శక్తి సామర్థ్యాలు, ఆలోచనా విధానం, సమయ స్పూర్తి ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయనే విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సామాజిక సమస్యల పట్ల, సామాన్య ప్రజల కష్టాల పట్ల వెంటనే స్పందించే ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఒకరు. ఆయన ఆలోచనా విధానం, రాజకీయ తత్వం మనందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో చంద్రబాబుని ఎవరైనా బాధితులు తమను ఆదుకోవాలని వేడుకుంటే తక్షణమే సహాయం అందిస్తున్నారు. 



ఇటీవల కాలంలో ఈ పరంపర మరింతగా పెరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితులు సైతం ఏకంగా బాబుకే గోడు వెల్లబోసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సరిగా ఇలాంటి సంఘటనే నేడు చోటుచేసుకుంది. ‘రెండు చేతులు లేవనుకుటున్నారా...? నాకు గుండెల నిండా ఆత్మవిశ్వాసం ఉంది. మొండి చేతులతో కారు నడుపుతాను, బైక్‌ తోలతాను.’ 



రైలు ప్రమాదంలో రెండు చేతులూ కొల్పోయిన పట్టి శీనుబాబు అనే యువకుడు ఆత్మవిశ్వాసంతో అన్న ఈ మాటలకు ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. తనకు ఉపాధి కల్పించాలన్న అతని అభ్యర్థనను విని వెంటనే లక్ష రూపాయిలు మంజూరు చేయడంతో పాటు బిసి కార్పొరేషన్‌ ద్వారా రూ.4 లక్షలు రుణంగా అందించారు. శుక్రవారం సీఎంఓలో అనేక మందిని కలిసిన సీఎం వారి సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: