ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతి అయిన జియోనా 72వ పుట్టినరోజు వేడుక గురువారం ఘనంగా జరిగింది. మిజోరాం రాష్ట్రం సెర్చిప్ జిల్లాలోని బక్తాంగ్ త్లాంగువం గ్రామంలో 38 మంది భార్యలు, 89 మంది సంతానం నడుమ నిర్వహించిన బర్త్‌డే పండుగను తలపించింది. చెన మతతెగకు చెందిన 2100 మంది ఈ వేడుకకు హాజరై జియోనా రాసిన పాటలకు నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. చెన మత తెగ నేత అయిన జియోనాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు పెద్దసంఖ్యలో మనుమలు, మనురాళ్లు ఉన్నారు. 

ziona


చానాకు మొదటిసారిగా 15 ఏళ్ల వయస్సులో పెళ్లి అయింది. 2004లో 60 ఏళ్ల వయస్సులో ఆయన చివరి వివాహం చేసుకున్నారు. మొత్తం కుటుంబసభ్యులు 181 మంది. పిల్లలు, భార్యలతో 4 అంతస్తుల భవనంలో ఆయన నివాసం ఉంటున్నాడు. వంద గదులున్న ఆ భవనం పెద్ద హోటల్‌ను తలపిస్తుంది. మొత్తం కుటుంబానికి ఒక రోజు విందు ఏర్పాటు చేయడానికి వారికి 30 కోళ్లు అవసరమవుతాయి. ఆ కుటుంబంలో మిలటరీ క్రమశిక్షణ పాటిస్తారు. పెద్ద భార్య
జాతియాంగి ఆ ఇంట్లో వంట, శుభ్రత తదితర బాధ్యతలు చూసుకుంటారు.


నాలుగు అంతస్తుల భవనంలో 162 మంది కుటుంబసభ్యులతో ఆయన నివసిస్తుంటారు. ఈ భవనాన్ని న్యూ జనరేషన్ జన్మస్థలంగా స్థానికులు చెప్పుకొంటారు. జియోనా కుటుంబం వల్ల రాష్ట్రంలోనే ఈ గ్రామం పర్యాటక కేంద్రంగా మారింది.  ‘నేను దేవుని ప్రత్యేక పుత్రుడ్ని.. అందుకే ఇంత మంది బాధ్యతలు చూసుకోమని నాకు దేవుడు వీరిని ప్రసాదించాడు’ అని చానా తన జన్మదినం సందర్భంగా గర్వంగా చెప్పుకొన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: