ఈ మద్య కాలంలో అరబ్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా తయారైంది. ఉగ్రవాదులు ఎక్కడ నుంచి ఎటాక్ చేస్తారో తెలియక బిక్కు బిక్కున జీవనం వెల్లదీస్తున్నారు.  ఇప్పటికే పలు మార్లు బాంబుదాడులు జరిగాయి..తాజాగా దెహ్‌మజాంగ్ సర్కిల్‌లో ప్రదర్శన జరుగుతుండగా పేలుళ్లు జరిగాయి.  ప్రదర్శన జరిపే వారినే టార్గెట్ చేసుకొని ఉగ్రమూకలు రెచ్చిపోయారు. దహ్మజంగ్ ప్రాంతంలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 60 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు.  జంట పేలుళ్లు  జరగడంతో వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముగ్గురు ఆత్మాహుతి దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.  ఇక తమ సమస్యల గురించి ముఖ్యంగా విద్యుత్ లైన్ విషయంలో షియా హజారా వారు వేల సంఖ్యలో వస్తూ నిరసనలు తెలిపారు.

ఇదే అదునుగా తమ పైశాచిక చర్యలకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. జంట జంట పేలుళ్లులతొ అక్కడి వాతావరణం రక్తసిక్తం అయ్యింది. గాయపడ్డవారి ఆర్తనాదాలు..బంధువుల రోదనలతో అక్కడ వాతావరణం హృదయవిదారకంగా తయారైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: