తెలుగు రాష్ట్రాలు రెండూ విడిపోయిన దగ్గర నుంచీ రెండు రాష్ట్రాలలో జరిగే పరిస్థితులనీ, స్థితిగతులనీ, అభివృద్ధినీ అన్నింటినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజానికి అత్యంత ఆసక్తితో వారు గమనిస్తూ ఉన్నారు. ఇక ఎలెక్షన్ లు పూర్తి అయ్యి ప్రభుత్వాలు ఫార్మ్ అయిన తరవాత అయితే ముఖ్యమంత్రులు అయిన చంద్రబాబు నీ కల్వకుంట కెసిఆర్ నీ ప్రతీ విషయం లో పోలుస్తూనే ఉన్నారు.

 

ఎవరు ఎలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనే విషయం లో ప్రతీ రోజూ కంపేరిజన్ లు సాగుతూనే ఉన్నాయి.నిర్ణయాలు తీసుకోవడం లో కెసిఆర్ ది ఒక శైలి చంద్రబాబు ది మరొక స్టైల్. సౌమ్యుడుగా కనిపించే చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడం లో ఒకింత ఆలస్య౦, ఒకింత ఉదాసీనత చూపిస్తారు కానీ కెసిఆర్ మాత్రం నిర్ణయాలు తీసుకోవడం లో అసలు వెనక అడుగు వెయ్యరు. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతారు. ఎన్నికలు ఎదురుకునేందుకు సిద్దమవడం అనే పాయింట్ మీద పొలిటికల్ సర్కిల్ లో పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు. ఏపీ లో ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదారు మునిసిపల్ కార్పరేషన్ లూ ఒక పురపాలక సంఘం , మరొక నగర పంచాయతీ లో ప్రత్యెక అధికారుల పాలన ని చంద్రబాబు ప్రభుత్వం మరొక ఆరునెలల పాటు పొడిగించింది.

 

గత నెలాఖరుతో కాకినాడ - గుంటూరు - తిరుపతి - కర్నూలు - ఒంగోలు కార్పొరేషన్లు - కందుకూరు మున్సిపాల్టీ - రాజంపేట నగర పంచాయతీల్లో పత్యేకాధికారుల పాలన ముగిసింది. జూలై 1 నుంచీ డిసెంబర్ 31 వరకూ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగాలి అని ప్రభుత్వం మునిసిపల్ శాఖ కి ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31 వరకూ లేదా కొత్త పాలక వర్గం వచ్చే వరకూ ఇది కొనసాగాలి అని ప్రభుత్వం స్వయంగా చెప్పడం విశేషం. ఉత్తర్వుల ఆధారంగానే ఎన్నికలు జరగడం అనే విషయంలో చంద్రబాబు భయపడ్డారు అని టాక్ నడుస్తోంది. అధికార పక్షం అనగానే ఎప్పుడైనా ఎన్నికలకి సై అంటుంది. అదే విధంగా తెలంగాణా లో బాల ప్రదర్సన చెయ్యడం కొస కెసిఆర్ సిద్దం అయ్యారు.  మెదక్ పార్లమెంటు - వరంగల్ పార్లమెంటు సహా పాలేరు - నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో కేసీఆర్ ఇదే రీతిలో దూకుడుగా పోయారు. తెరాస గెలవడం తో ఆయన అక్కడ ఫుల్లు ఖుషీ అయ్యారు కూడా. కానీ బాబు భయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: