సాధారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లితే కొన్నిసార్లు ప్రకృతి విపత్తుతో ఎన్నో కష్టాలు పడుతుంటారు..ఒకోసారి వేటకు వెళ్లడం కూడా మానేస్తారు. అయితే ఈ మద్య కృష్ణ నదిలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులుకు ఓ వింత అనుభవం చోటు చేసుకుంది. తాము వేసిన వలలు ఒక్కసారిగా ఛిద్రమయ్యాయి..దీనికి కారణం ఏంటా అని చూస్తే ఓ రకమైన చేపలు వలలు మొత్త ఛిద్రం చేసినట్లు తెలుసుకున్నారు. అయితే వారికి చిక్కిన కొన్ని చాపలు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు.

ఇప్పటి వరుకు అలాంటి చేపలు ఎప్పుడూ చూడలేదని వాటిరి చూస్తుంటే..దెయ్యం చేపల్లా, రాక్షస చేపల్లా కనిపిస్తున్నాయి. చెపలకు పొలుసులు ఉన్నట్లే వాటికి అన్నీ ముళ్లులే ఉన్నట్లు దీంతో వలలు మొత్తం చిరిగిపోయినట్లు చెబుతున్నారు. వర్షాలు పడడంతో నదుల్లో నీళ్లు చేరుతున్నాయి. ఈసమయంలో మంచి మాంచి చేపలు వలలో పడతాయనుకొని వేటకు వెళ్లితే భయంతో పారిపోయి రావాల్సి వచ్చిందని అంటున్నారు.

కృష్ణానదిలో చేపల వేట చేస్తున్న మత్స్యకారులకు ఆ వింత చేపలు దొరకడం ఈ చేపల నిండా ముళ్లు ఉండడం అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఎన్నడూ ఇలాంటి చేపలు చూడలేదని మత్స్యకారులు అంటున్నారు. ఇక ఫిరానా అనే చేపల గురించి మనకు తెలుసు అవి కూడా ఏ వస్తువైనా చేపలు,జంతువులను ఇట్టే నమిలేస్తాయి. అలాంటి చేపలు చాలా ప్రమాదమని మత్స్యకారులు హెచ్చిరిస్తుంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: