అక్రమాస్తుల కేసులో జగన్ గతంలో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ జగన్ పై ఫిర్యాదు చేసినవారెవరో గుర్తుందా.. కాంగ్రెస్ నేత శంకర్రావు.. మరో కేసులో ఎర్రన్నాయుడు కూడా పిటీషన్ వేశారని చెబుతారు. ఈ రాజకీయ నేతల ఆరోపణల తోనే విచారణకు కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. 

ఇంకో విచిత్రం ఏంటంటే.. శంకర్రావు దాఖలు చేసిన పిటిషన్లో అయితే కనీసం ఆయన సంతకం కూడా లేదని చెబుతారు. కానీ అలాంటి కాగితాలే.. విచారణలకు, జగన్ కారాగార వాసానికి దారి తీశాయి. కేవలం జగన్ మాత్రమే కాదు.. ఇంకా చాలామంది నాయకులు ఇలా పిటీషన్ల ద్వారా కోర్టుబోనులో నిలబడ్డారు. విచారణ ఎదుర్కొన్నారు. 


కానీ చంద్రబాబు విషయంలో మాత్రం అలా జరగడం లేదంటున్నారు వైసీపీ నేతలు. చెన్నై సదావర్తి భూముల విషయంలో అక్రమాలు జరిగాయంటూ వేసిన పిటీషన్లను కోర్టుకు కొట్టేశాయి.  కేవలం పత్రికల్లో వచ్చిన వార్తలనే ఆధారాలుగా సమర్పించాడని సదావర్తి విషయంలో పిటిషన్ ను తిరస్కరించారట. మరో పిటిషన ను బాబుకు రాజకీయ ప్రత్యర్థులు వేశారని తిరస్కరించారట. 

ఇలా చంద్రబాబుకు కోర్టుల్లో ఎదురే ఉండదనే వాదనకు మరోసారి బలం చేకూరిందంటున్నారు వైసీపీ నేతలు, అభిమానులు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అయినా ఓడిపోయాడు కానీ, కోర్టుల వద్ద మాత్రం చంద్రబాబుకు ఓటమి అంటూ లేదని సెటైర్లు వేస్తున్నారు. అంశం ఏదైనా కావొచ్చు, కేసులు వేసిన వాళ్లు ఎవరైనా కావొచ్చు.. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల విషయంలో కానీ, ఆయన వ్యక్తిగత వ్యవహారాలపై కానీ.. కోర్టులకు వెళ్లిన వారు నిరాశతో వెనుదిరగాల్సిందేనని ఢంకా భజాయిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: