అధికారంలో ఉన్నవారు అడ్డగోలుగా సంపాదించడం సర్వసాధారణంగా మారిపోయిన రోజులివి.. మరి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు అడ్డదారులు తొక్కకుండా ఉంటారా.. కానీ అడ్డదారులు తొక్కినా ఎక్కడా తమ పేరు రాకుండా చూసుకుంటారు. అందుకే వారి అక్రమార్జన అంతా బినామీ పేరుతో ఉంటుందట. 

చాలా మంది రాజకీయ నేతలు తమ అనుచరులను, నమ్మకస్తులను బినామీలుగా పెట్టుకుని వారి పేరుతో ఆస్తులు కూడబెట్టడం రాజకీయాల్లో చాలామంది విషయంలో జరుగుతోంది. అందువల్లే వారి అవినీతి వెలుగు చూడటం చాలా కష్టతరమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా ఇలాంటి ఓ బినామీని పెట్టుకున్నాడని వైసీపీ ఆరోపిస్తోంది. 


మరి ఇంతకీ లోకేశ్ పెట్టుకున్నాడని చెబుతున్న బినామీ ఎవరో తెలుసా.. సదావర్తి భూముల కుంభకోణంలో ప్రధానంగా ఆరోపణలకు గురి అవుతున్న కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయనట. ఈ విషయాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది వేణుగోపాల కృష్ణ చెబుతున్నారు. అందుకే వెయ్యి కోట్ల విలువ జేసే సదావర్తి భూములను ఆయనకు కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. 

సదావర్తి భూముల విషయంలో అడ్డగోలు నిబంధనలు రూపొందించి వేరెవరూ వేలానికి రాకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణంపై సిబిఐ విచారణ జరగాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూములకు రామానుజయ ఇచ్చినదానికన్నా ఐదు కోట్లు ఎక్కువ ఇస్తామని వచ్చిన సంస్థకు భూమి ఇవ్వకుండా షరతులు పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: