హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోయింది. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. భవనం శిథిలాల కింద చిక్కుకుని మరో 12 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా జరిగింది ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ భవనంలో కావడం మరో విశేషం. 

భవన విస్తరణలో భాగంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న 14 పిల్లర్లు కూలిపోయినట్టు తెలుస్తోంది. ఇరవై రోజులుగా ఈ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా దీనికి ఆనుకొని ఉన్న మరో బిల్డింగ్ కూడా దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. 

building collapse


ప్రమాద ఘటనతో మేలుకొన్న జీహెచ్ ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనుమతులను పరిశీలించారు. ఫిల్మ్ నగర్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ నిర్మాణాలకు అనుమతులు లేవన్న సంగతి అప్పుడు బయటపడింది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ ధ్రువీకరించారు. 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ భవన ప్రమాదం దుర్ఘటనపై విచారణ ప్రారంభించామని చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్నారు. గాయపడినవారిని సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని పలువురు నేతలు పరామర్శించారు. మొదటి ఫ్లోర్ వేసిన 24 గంటల్లోనే రెండో ఫ్లోర్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: