ఉగ్ర‌వాదం పై చిత్త‌శుద్దితో పోరాటం చేస్తున్నామ‌ని పాకిస్థాన్ చెబుతూ వ‌స్తుంది. పైకి ఒక‌టి చెప్ప‌డం, లోప‌ల ఇంకోటి చేయ‌డం ఆ దేశానికి పరిపాటిగా మారింది. ఇక ఎందుకు భ‌యం చేసేదే చెప్పేద్దామ‌నుకున్నారో ఏమో తెలియ‌దు కానీ ఇప్పుడు ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌లోకి పాకిస్థాన్ ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తం దిగిపోయింది. జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర‌వాదుల‌కు ఇంత‌కాలం ప‌రోక్షంగా అండ‌దండ‌లు అందిస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు నేరుగా కార్య‌చ‌ర‌ణ‌లోకి దిగిన‌ట్టుగా క‌నిపిస్తుంది. జ‌మ్మూ క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల‌ను దాటించి ఉగ్ర‌వాదుల‌ను భార‌త్ పైకి ఉసిగొల్పు తున్న ఉగ్ర‌వాద నేత‌ల వెనుక పాకిస్దాన్ సైన్యానికి చెందిన ఐఎస్ఐ హ‌స్తం ఉన్న‌దనే విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్యం. భార‌త్ పై జ‌రిగిన చాలా దాడుల విష‌యంలో ఇది సాక్ష్యాధారాల‌తో స‌హా రుజువైంది.

బుర్హాన్ ఎన్ కౌంటర్ పై పాక్ లో నిర‌స‌న‌లు...

అయితే ఉగ్ర‌వాదంతోనే తమ దేశం ఎక్కువ‌గా న‌ష్ట పోయింద‌ని చెప్పుకుంటున్న పాకిస్థాన్... ఇప్పుడు అదే పంథాను అవ‌లంబిస్తోంది. తాజాగా జ‌మ్మూ క‌శ్మీర్ లో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌వాది బుర్హాన్ వ‌ని ఆచూకీని ఇటీవ‌ల క‌నిపెట్టిన భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు అత‌డిని ఎన్ కౌంటర్ చేశాయి. దీనికి నిరిస‌న‌గా పాకిస్థాన్ లో ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. పాకిస్థాన్ ప్ర‌భుత్వం ఉగ్ర‌వాది అయిన బుర్హాన్ వ‌నిని అమ‌ర‌వీరుడిగా కీర్తించింది. పాకిస్థాన్ లో త‌ల‌దాచుకుని ఉన్న ముంబై దాడుల సూత్ర‌ధారి, జ‌మాత్ ఉల్ ద‌వా చీఫ్  హ‌ఫీజ్ స‌య్య‌ద్ గ‌త మూడు రోజుల క్రిత‌మే లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వ‌ర‌కు దాదాపు 264 కిలో మీటర్లు భారీ ర్యాలీ నిర్వ‌హించాడు. అంటే పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఉన్న కీల‌క సంబంధం దాచి పెట్ట‌లేని స్థితిని చేరుకున్నారు. కశ్మీర్ కు స్వాత్రంత్యం సాధించాల‌నే కార‌ణంతో క‌శ్మీర్ కార‌వాన్ పేరుతో హ‌ఫీజ్ పెద్ద ఎత్తున ఉద్య‌మాలు న‌డుపుతుంది.
 
భార‌త్ పై య‌ద్దం ప్ర‌క‌టించిన ఉగ్ర‌వాది హ‌ఫీజ్...

క‌శ్మీర్ ఉగ్ర‌వాది బుర్హాన్ వని ఎన్ కౌంట‌ర్ పై పంజాబ్ ఫ్రావీన్స్ లోని గుజ్రాజ్ వాలా ప‌ట్ట‌ణంలో స‌భ కూడా నిర్వ‌హించాడు. ఈ స‌భ‌లో మాట్లాడుతూ... అత‌డు భార‌త్ పై యుద్దం ప్ర‌క‌టించాడు. క‌శ్మీర్ వేర్పాటు వాద నేత స‌య్య‌ద్ గిలానీ ప్ర‌తిపాదించిన నాలుగు విశ్వాసం పాదుగొలిపే ప్ర‌మాణాల‌ను భార‌త్ వెంట‌నే అమలు చేయాల‌ని, లేకుంటే యుద్దాన్ని ఎదుర్కోవ‌డానికి సిద్దంగా ఉండాల‌ని హెచ్చ‌రించాడు. జ‌మ్ము క‌శ్మీర్ కు స్వ‌త్రంత్య్ర నిర్ణ‌యాధికారం ఉండాల‌నేది గిలానీ తొలి సూత్రం. అది అమలు చేయ‌క‌పోతే యుద్ద‌మేన‌ని ఇప్పుడు హ‌ఫీజ్ హెచ్చ‌రిస్తున్నాడు. ఐక్య రాజ్య స‌మితి నిషేధించిన ఉగ్ర‌వాది హ‌ఫీజ్ ప‌లుకేసుల్లో ప్ర‌ధాన నిందితుడు. తల‌పై 50 ల‌క్ష‌ల రివార్డు ఉన్న బుర్హాన్ వ‌నిని వెన‌కేసుకు వ‌స్తున్నాడు. దీనికి పాకిస్తాన్ ప్ర‌భుత్వం వంత పాడుతుండ‌టంతో భార‌త్ తీవ్ర‌మైన హెచ్చ‌రిక చేసింది. పాకిస్థాన్ కు భార‌త్ తీవ్ర‌ హెచ్చ‌రిక‌లు చేయ‌డం ఇటీవ‌ల కాలంలో ఇదే మొద‌టి సారి.

పాక్ పై భార‌త్ తీవ్ర‌మైన హెచ్చ‌రిక‌లు...

గ‌త కొన్ని సంవ‌త్సరాలుగా పాక్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌ను ఉపేక్షిస్తూ వ‌స్తున్న భార‌త ప్రభుత్వం ఇంత తీవ్ర హెచ్చ‌రిక‌లు చేయ‌డానికి ఎన్నోకార‌ణాలు ఉన్నాయి. పాకిస్థాన్ నేరుగా భార‌త్  విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం, ఉగ్ర‌వాదుల‌ను ప్రోత్స‌హిస్తూ శాంతి సామ‌రస్యాల‌కు ఆటంకం క‌లిపించ‌డం ఇటీవ‌లి కాలంలో బాగా పెరిగిపోయింది. చ‌ర్చ‌ల పేరుతో భార‌త్ ముందుకు వ‌స్తున్నా దాన్ని పాకిస్థాన్ అలుసుగా తీసుకుంటున్న‌ది. అందుకే భార‌త్ ఇంత‌టి  తీవ్రమైన హెచ్చ‌రిక‌లు చేసింది. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై జ‌మ్మూక‌శ్మీర్ అంశాన్ని త‌ర‌చూ లేవ‌నెత్తుతున్న పాకిస్థాన్ కు ఇదే స‌రైన స‌మాధానం కాగ‌ల‌దు. ఆక్ర‌మించిన క‌శ్మీర్ నుంచి ముందు పాకిస్థాన్ వైదొల‌గాల‌ని భార‌త్ ఇక నుంచి త‌ర‌చూ డిమాండ్ చేస్తూ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణను రూపొందించుకుంటున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అయితే భార‌త్ హెచ్చ‌రిక‌లతో పాకిస్థాన్ కూడా అప్ర‌మ‌త్త‌మైంది.రానున్న ప్ర‌మాదాన్ని ముందే ప‌సిగట్టిన పాక్ అందుకు అణుగుణంగానే యుద్దానికి సంసిద్ద‌మైంది. 

సైనిక బ‌లం భార‌త్ కే ఎక్కువ‌...

ఇక భార‌త్ హెచ్చ‌రిక‌లతో సరిహ‌ద్దుప్రాంతాల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొనే అవ‌కాశాలు ఉన్నాయి. రెచ్చిపోతున్న పాకిస్థాన్ ను ఇంత కాలం భార‌త్ చూస్తూ ఊరుకుంది. చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోవాల‌ని  భావించింది కానీ త‌ర‌చూ రేగుతున్న క‌ల్లోలాన్ని అదుపు చేసేందుకు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌ద‌నే భావ‌న‌కు భార‌త్ వ‌చ్చేసింది. పాకిస్థాన్ తో పోలిస్తే  సైనిక బ‌లం విష‌యంలో భార‌త్ అన్ని ర‌కాలుగానూ ముందుంది. భార‌త్ వ‌ద్ద 13 ల‌క్ష‌లు ప‌దాతి ద‌ళాలు ఉంటే పాకిస్థాన్ వ‌ద్ద 6 ల‌క్ష‌లు ఉన్నాయి.  ఇక రిజ‌ర్వు బ‌లగాలు మ‌న దేశానికి 8 ల‌క్ష‌లైతే పాకిస్థాన్ కు 5 ల‌క్షలు. ప్ర‌ధాన యుద్ద ట్యాంకులు భారత్ కు నాలుగు వేల ఒక వంద ఉంటే... పాకిస్థాన్ కు రెండు వేల ఐదు వంద‌లు ఉన్నాయి. అటు వైమానిక బ‌లంలోనూ మ‌న‌దేశ‌మే ముందుంది. మన వైమానిక యుద్దయోధ‌ల సంఖ్య ల‌క్షా డెబ్బై వేలు. పాకిస్థాన్ కు న‌ల‌బైఐదు వేల  మంది వైమానిక యోధులు ఉన్నారు.

యుద్ద హెలికాప్ట‌ర్లు పాక్ కు ఒకటి కూడా లేదు...

యుద్ద హెలికాప్ట‌ర్లు భార‌త్ కు 20 ఉంటే పాక్ కు ఒక‌టి కూడా లేదు. భార‌త్ నౌకాద‌ళ యోధుల సంఖ్య యాభై ఐదు వేలు కాగా... పాకిస్థాన్ కు ఇర‌వైఐదు వేల మంది ఉన్నారు. యుద్ద వాహ‌క నౌక మ‌న ద‌గ్గ‌ర ఒక‌టి ఉంటే దాయాది దేశానికి ఒక్క‌టి కూడా లేదు. వైమానిక స్థావ‌రాలు భార‌త్ లో 12 ఉంటే పాకిస్థాన్ లో 7 మాత్ర‌మే ఉండ‌టం విశేషం. అయితే అత్యాధునిక ఆయుధాల‌ను స‌మ‌కూర్చుకోవ‌డంలో పాకిస్థాన్ మ‌నకంటే కాస్త ముందుంది. మ‌న ద‌గ్గ‌ర 80 అణు వార్ హెడ్ లు ఉంటే... పాకిస్థాన్ ద‌గ్గ‌ర 90 నుంచి 100 వ‌ర‌కూ ఉన్నాయి. క్షిప‌ణులు  మాత్రం ఇరు దేశాల వ‌ద్ద స‌మానంగానే ఉన్నాయి.  అంటే అన్ని విధాలుగానూ మ‌న దేశానిదే పైచెయ్యి అన‌డంలో సందేహం లేదు. కానీ ర‌క్ష‌ణ వ్య‌వ‌హారాలు నిశితంగా ప‌రిశీలించే నిపుణులు మాత్రం భార‌త్ ప్ర‌స్తుతానికి యుద్దం జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. దీనికి ఓ కార‌ణం లేక‌పోలేదు.  

సుఖోయ్ ఎంకేఐ, బ్ర‌హ్మోస్ క్షిప‌ణులు...

భారత్ ర‌క్ష‌ణ వ్య‌వహారాల వాద‌న ప్ర‌కారం మ‌న దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ  ఇప్పుడు అంత బలంగాలేదు. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను నిశింతగా గ‌మ‌నిస్తే.... త్రివిధ ద‌ళాల‌ను బలోపేతం చేయ‌డానికి నిర్దేశించిన అనేక  చ‌ర్య‌లుల ఇంకా కొలిక్కి రాలేదు. ర‌ష్యా నుంచి యుద్ద విమానాలు కొనుగోలు 2020 నాటికి గానీ పూర్త‌య్యేలా లేదు. సుఖోయ్ ఎంకేఐ విమానాల‌కు గ‌గ‌న త‌ల బ్ర‌హ్మోస్ క్షిఫ‌ణి అమ‌ర్చే ప్ర‌క్రియ ఈ ఏడాది చివ‌రికి గానూ పూర్తి కాదు. ఇలా చూసుకుంటూ పోతే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ చాలా లొసుకులే ఉన్నాయి. అంతేకాదు భార‌త్ కు న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు సైతం వెంటాడుతోంది. మొత్తంమీద భార‌త్ కు పాకిస్థాన్ తో ఇప్ప‌టికిప్పుడే స‌రైంది కాదని ర‌క్ష‌ణ నిప్పుల అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: