ఐసిస్ ఉగ్రవాదులు ప్రపంచ వ్యాప్తంగా రెచ్చిపోతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ.. ఇలా ఏ దేశాన్నీ వదలిపెట్టడం లేదు. అలాంటిది మన ఇండియాపైనా వారి కన్ను ఉండదని అనుకోలేం. అంతే కాదు.. మన డిల్లీకి ఉగ్రముప్పు పొంచి ఉందట. 

ఈ మేరకు కేంద్రభద్రతా సంస్థలు హెచ్చరించాయి. జాతీయ రాజధాని ప్రాంతంలోని వివిధ భద్రతా దళాల ప్రధాన కార్యాలయాలపై బాంబుదాడులు జరగొచ్చని విశ్వసనీయ సమాచారం. ఇవే కాకుండా ఐబీ, రా వంటి నిఘా సంస్థల ప్రధాన కార్యాలయాలు కూడా ఢిల్లీలోనే ఉంటాయి.


ఈ  సంస్థలకూ ఉగ్రదాడి జరిగే ప్రమాదముందని ఆయా సంస్థలన్నీ అప్రమత్తంగా ఉండాలని భద్రతాదళాలు సూచిస్తున్నాయి. డిల్లీ రాజధాని ప్రాంతం పరిథిలో భద్రతను కట్టుదిట్టం చేయాలన్న కేంద్రభద్రతా సంస్థలు పొరుగునున్న నొయిడా, ఘజియాబాద్ , గుడ్ గావ్ లోనూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్దేశించాయి.

ఉగ్రదాడుల్ని నివారించేందుకు దాడి ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించాయి. మరో 20రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నవేళ.. దేశ రాజధానికి ఉగ్రముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: