ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో.. అంటూ తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన గాయని సునీత ఎవరో తెలియని వారు చాలా అరుదు అనే చెప్పాలి. అందమైన గొంతు ఉన్నవారికి అందమైన రూపం ఉండకపోవచ్చు..

అందమైన రూపం ఉన్నవారికి అందమైన స్వరం ఉండకపోవచ్చు. కానీ బంగారానికి తావి అబ్బినట్టు .. సౌందర్యం, స్వరం రెండూ ఉన్న గాయని సునీత. అందుకే ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా.

కానీ అలాంటి సౌందర్య గాయని వైవాహిక జీవితం మాత్రం ఓ ఫెయిల్యూర్ స్టోరీ. ఇన్నాళ్లూ తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా మాట్లాడని సునీత తాజాగా.. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో ఆమె మాటల్లోనే..


"సునీత భర్త కాకపోతే అతనికి బయట ఐడెంటిటీ లేదు. నా దృష్టిలో భార్యాపిల్లల పట్ల బాధ్యతగా లేనివాడు క్యారెక్టర్‌లెస్ ఫెలోనే. ఈ రోజుకీ నా కొడుకు ఏ యూనివర్శిటీలో చదువుతాడో అతనికి తెలియదు. తెలుసుకోవాలని అనుకోడు. ఇప్పటికీ నా పేరు చెప్పి డబ్బులు అడుక్కుంటాడు.."

" సునీత ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉందని చెప్పి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేశాడు. ‘సునీత నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తినడానికి తిండి లేదు. వారం రోజులుగా హాస్పిటల్‌లో ఉన్నాను, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’ అని చెప్పుకున్నవాడు విడాకులు ఎందుకు ఇవ్వడం లేదు?"

" నా సహనాన్ని పీక్స్‌లో పరీక్షించాడు.  ‘తిన్నావా.. ఏ సినిమా చూశావ్? ఎలా ఉన్నావ్?’ అని కొడుక్కి ఫోన్ చేసి, మాట్లాడతాడు. ఫైనాన్షియల్‌గా కాకపోయినా పిల్లాడికి ఏ కాలేజ్ మంచిది? ఏం చేస్తే మంచిది?.. ఇవన్నీ మాత్రం పట్టించుకోడు.."



మరింత సమాచారం తెలుసుకోండి: