ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్ పంచె పైకి ఎగగట్టి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. స్వచ్ఛ భారత మిషన్, భేటీ బచావ్-భేటీ పఢావ్ పథకాలకు నిధుల సేకరణలో భాగంగా ఢిల్లీలో సినీ నటులు, పార్లమెంటేరియన్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముగిసిన తరువాత రాందేవ్ కూడా కాసేపు బంతి వెనుక పరుగులు తీసి ఆకట్టుకున్నారు. పంచె పైకెత్తి కట్టి ఫుట్‌బాల్‌ ఆడారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన చారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్లు, పార్లమెంట్ సభ్యుల మధ్య జరిగిన పోటీలో రాందేవ్ బాబా సైతం పాల్గొన్నారు. కాషాయరంగు ధోతీని పైకి కట్టిన బాబా బలైమన కిక్కులతో బంతిని పరిగెత్తించారు.



ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్, బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాలపై అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అభిషేక్ బచ్చన్ నేతృత్వంలో ఆల్‌స్టార్ ఫుట్‌బాల్ క్లబ్, బాబుల్ సుప్రియో నేత్రత్వంలోని పార్లమెంటేరియన్ల జట్టు పోటీ పడింది. బాలీవుడ్ జట్టులో రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, డినో మోరియా, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు ఉండగా పార్లమెంటేరియన్ల జట్టులో భారత ఫుట్‌బాట్ జట్టు మాజీ కెప్టెన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రసూన్ బెనర్జీ, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ, పర్వేష్ వర్మ, కమలేష్ పాశ్వాన్, సతీష్ గౌతమ్, భోలా సింగ్, దుష్యంత్ చౌతాలా, రామ్ మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు. 



మ్యాచ్ వీక్షించేందుకు 800 నుంచి 200 వరకు టికెట్ వసూలు చేశారు. ఈ నిధులను ఆ రెండు పథకాలకు వినియోగించనున్నారు. ఈ పథకాలకు బాబారాందేవ్ విరాళమివ్వనప్పటికీ మ్యాచ్ లో ఆడిన ఎంపీలకు పంతజలి ఫుడ్స్ ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: