గత కొంత కాలంగా అమెరికాలో జనజీవనం అస్త వ్యస్తంగా తయారైందనే చెప్పాలి. ఎక్కడ ఏ బాంబు పేలుతుందో..ఎక్కడ నుంచి కాల్పులు జరుగుతాయో అన్న భయబ్రాంతుల్లో జనాలు బతుకుతున్నారు.  ఇప్పటికే పలు మార్లు అమెరికాలో కాల్పుల మోతతో జనాలు భయపడుతుంటే..తాజగా మ‌రో దారుణం చోటు చేసుకుంది. ఫ్లోరిడా నైట్‌క్ల‌బ్‌లో ఓ దుండ‌గుడు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్ద‌రు మృతి చెంద‌గా, మ‌రో 17 మంది గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.   ఈ సంఘటన  ప‌శ్చిమ ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయ‌ర్స్‌లో ఉన్న క్లబ్ బ్లు క్ల‌బ్‌లో జరిగింది. .  ఫ్లోరిడా ఫోర్ట్‌ మెయర్స్‌లోని ‘క్లబ్‌ బ్లూ’లో ‘టీన్ నైట్’ పార్టీ జరిగింది. ఈ పార్టీలో 13 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలలు పాల్గొన్నారు.

ఆ బాలులనే లక్ష్యంగా చేసుకొని అగంతకులు నైట్‌ క్లబ్బులో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. 30 రౌండ్లకు పైగా తుపాకీ పేలిన శబ్ధం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.  సోమవారం తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. కొందరికి స్వల్ప గాయాలు కాగా.. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు చెప్పారు.

వారు కొందరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గతనెలలో ఆర్లాండోలోని గే నైట్‌ క్లబ్బులో ఓ ఉన్మాది కాల్పులు జరిపి.. 50మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఒమర్ మతీన్ అనే ఉన్మాది జరిపిన ఈ నరమేధాన్ని మరువకముందే మరోసారి పిల్లలు లక్ష్యంగా కాల్పులు జరగడం అమెరికావాసులను ఆందోళన పరుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: