కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడు.. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర చెప్పుకోదగినంత లేకపోయినా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేటీఆర్ క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. ఐటీ మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఐటీ రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

టీ హబ్ ఏర్పాటు వంటి చర్యలతో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు కేటీఆర్. అంతే కాదు.. తండ్రి తరపున విదేశీ ప్రతినిధులనూ కలుస్తున్నాడు. కేసీఆర్ కూడా తన తర్వాత కేటీఆరే అన్నవిషయాన్ని అటు పార్టీ నేతలకూ, ప్రజలకూ పరోక్షంగా చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ జన్మదినం తెలంగాణలో ఘనంగా జరిగింది. 


విచిత్రమైన విషయం ఏంటంటే.. అటు ఆంధ్రాలోనూ కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు కేటీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేకులు కట్ చేసి ఆనందం పంచుకున్నారు. రాజమండ్రి, భీమవరం, నర్సాపురం ,కాకినాడ తదితర చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేటీఆర్ అంటే ఆంధ్రాలోనూ సానుభూతి ఉందని దీంతో అర్థమవుతోంది. 

ఉద్యమంలో కేటీఆర్ ఆంధ్రులపై పరుషమైన మాటలు చెప్పకపోవడం.. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం, ఆంధ్రా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆంధ్రా వ్యాపారవేత్తలతో సంబంధాలు.. కారణాలు ఏమైనా కేటీఆర్ కు ఆంధ్రాలోనూ ఫాలోయింగ్ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడీ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: