జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు మహా పాదయాత్ర సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. సీఎం కేసీఆర్‌కు తన్నే రోజులు ముందున్నాయ ని అరుణ అన్నారు. 



ఎవరైనా భూమిని సర్వే చేసి ప్రాజెక్టులు చేపడతారని, ఈయనేమో గూగుల్‌లో చూసి ప్రాజెక్టులను కట్టడం ఏమిటో అర్థం కావడంలేదన్నారు. మాయమాటలు చెప్పి ప్రజాసంక్షేమం విస్మరిస్తున్న కేసీఆర్‌కు అబద్ధాలకోరు అవార్డు ఇవ్వచ్చని విమర్శించారు.  రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందన్నారు. ‘‘గతంలో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచి ఏం సాధించావ్.. జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యావ్.. బాంచన్‌దొర నీ కాల్మొక్తా అంటూ కాళ్లకాడ పడి ఉంటారని అనుకుంటున్నావేమో.. ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోతే తన్నే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని ధ్వజమెత్తారు.

తన్నే రోజులు ముందున్నాయ్!


ప్రభుత్వం మల్లన్నసాగర్ రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పై కాంగ్రెస్ ఉక్కు పాదం మోపిన సంగతి తెలిసిందే. భూములు కోల్పోయిన రైతులు అండగా నిలబడుతున్న కాంగ్రెస్ ప్రతిపక్షం భూమి కోల్పోయిన బాధితులను ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటుందని కాంగ్రెస్ నాయకులు గులాబీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: