ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూన ఎన్నో ప్రమాదాల వల్ల మనుషుల ప్రాణాలు గాల్లో దీపాల్లా ఆరిపోతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల వల్ల రోజుకు కొన్ని వందల మంది మృత్యువుకు బలై పోతున్నారు. ఎన్ని రక్షణ చర్యలు చేపడుతున్నా రోజురోజుకు ప్రమాదాలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. వ్యక్తి గతంగా ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా ఏదో ఒక అవయవాన్ని మాత్రం కోల్పోవడం జరుగుతుంది. అందుకే ఈ ప్రమాద బారిన పడకుండా ఉండాలంటే శరీర నిర్మాణ వ్యవస్థనే మార్చాలని ఆస్ట్రేలియా కు చెందిన ఒక సంస్థ ఒక శరీర నమూనాను రూపొందించింది. 



ఎంతో సాఫీగా గడుస్తున్న జీవితం ఒక్క యాక్సిడెంట్‌తో రోడ్డున పడిపోతుంది. ‘అతివేగం ప్రమాదకరం, నిబంధనలు పాటించండి, హెల్మెట్‌ ధరించండి’ అంటూ ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు చాలా మంది. అయితే రోడ్డు ప్రమాదాలు ఎన్ని జరిగినా ప్రాణాలు పోవడం గానీ, గాయపడడం గానీ జరుగకూడదంటే మానవులు పక్క ఫోటోలో ఉన్న వ్యక్తిలా మారిపోవాలట. 



 హెల్మెట్‌ లాంటి పెద్ద తల, లోపలికి చొచ్చుకోపోయినట్టుండే ముక్కు, చెవులతో కూడిన ఫ్లాట్‌ ఫేస్‌, మెడ లేకపోవడం, ప్రతీ పక్కటెముకకూ మధ్య ఎయిర్‌ బ్యాగ్‌ లాంటి నిర్మాణం, కాళ్లు, చేతుల్లో విచిత్ర ఎముకల నిర్మాణం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా పెద్దగా అపాయం ఉండదట. ప్రస్తుత మానవ నిర్మాణం మాత్రం చిన్నపాటి యాక్సిడెంట్‌ను కూడా తట్టుకోలేదట. ఆస్ట్రేలియాకు చెందిన ట్రాన్స్‌పోర్ట్‌ యాక్సిడెంట్‌ కమీషన్‌ ఈ నమూనాను రూపొందించింది. ఈ నమూనాకు ‘గ్రహమ్‌’ అని పేరు కూడా పెట్టింది. ఈ నమూనాను చూపెడుతూ రోడ్డ భద్రత గురించి అవగాహన కల్పిస్తోంది. ‘గ్రహమ్‌లా మారిపోవడం మనకు సాధ్యం కాదు.. అందుకే డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ సూచిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: