రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు తెగ బిజీగా ఉన్నారు. రాజధానిలోని కీలకమైన భవనాల కోసం  ఇప్పటికే అనేక మోడళ్లు, డిజైన్లు ఆయన చూశారు. మొన్నటికి మొన్న జపాన్ కంపెనీ మాకీ ఇచ్చిన డిజైన్లు చూస్తే అణువిద్యుత్ కర్మాగారాల్లా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. 


అంతే కాదు.. అవి న్యూక్లియర్ ప్లాంటులేనని పాక్ మీడియా కథనాలు కూడా వండేసింది. కానీ ఇప్పుడు అమరావతి కోసం కొత్త డిజైన్లు వచ్చేశాయి. వీటిని తయారు చేసింది మాత్రం మాకీ కాదు లెండి. ఈసారి మాస్టర్ ప్లాన్ తయారు చేసింది మలేషియాకు చెందిన ఆర్డీ హారిస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ. 


ఆ కంపెనీ ప్రతినిధులు విజయవాడ వచ్చ మరీ సీఎం చంద్రబాబుకు ప్రెజంటేషన్ ఇచ్చి వెళ్లారు. వీటిని చూస్తే మాకీ సంస్థ ఇచ్చిన డిజైన్ల కంటే కాస్త బాగానే ఉన్నాయి మరి.  రాజధానిలోని 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయాన్ని ఏరియల్ వ్యూలో చూపించేశారు మలేసియా కంపెనీ వాళ్లు. 


ఇక అసెంబ్లీని ‘ది సేక్రెడ్ అసెంబ్లీ’అంటారట.. సచివాలయాన్ని పీపుల్స్ సెక్రటేరియట్ అంటారట. ఇక హైకోర్టుకు ‘టెంపుల్ ఆఫ్ జస్టిస్’ అని పిలుస్తారట. అసెంబ్లీ బిల్డింగ్ మాత్రం వికసించిన కమలంలా ఉంది. మరి మోడీని బుట్టలోవేసుకునే ప్లాన్ ఏమైనా ఉందో ఏమో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: