ఇటీవల వరుసగా వివిధ దేశాల్లో ఉగ్రవాద సంఘటనలు జరుగుతున్నాయి.. గతంలో ఈ దాడులు అన్నీ బాంబులు, తుపాకులతో ఉండేవి.. ఇప్పుడు కొత్త పద్దతుల్లో దాడులు చేస్తున్నారు. జనాలను భయభ్రాంతులను చేస్తున్నారు ఉన్మాదులు.. ఉగ్రవాదులు..

మొన్నటికి మొన్న ఫ్రాన్స్ లో ఒకడు ట్రక్కును ఫుట్ పాత్ పై నడుపుతూ దాదాపు 100 మందిని చంపేశాడు. తాజాగా జపాన్  రాజధాని టోక్యోలో మరొకడు కత్తి పట్టుకుని రెచ్చిపోయాడు. ఓ వికలాంగుల వసతి గృహంలో దూరి.. కనిపించినవారినల్లా పొడుచుకుంటూ వెళ్లాడు. ఇలా దాడి చేసింది ఆ వసతి గృహంలో అంతకుముందు పని చేసిన ఉద్యోగి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. 


ఈ విచక్షణారహిత దాడిలో 20 మంది వరకూ చనిపోయారు. మరో 50 మంది వరకూ గాయపడ్డారు. టోక్యో శివారు ప్రాంతమైన సగామిహరాలో నడుస్తున్న  వికలాంగుల రక్షణ కేంద్రంలో సుకూయ్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. 

దాడి తర్వాత అతడే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రులకు చేర్చారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు పోలీసులు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: