సాధారణంగా మంత్రుల పర్యటనల్లో విపక్ష నేతలు ధర్నాలు చేయడం చూస్తుంటాం.. కానీ సొంత పార్టీ వాళ్లే మంత్రి కాన్వాయ్ ముందు ధర్నా చేయడం.. ధర్నా చేసిన వారిపై మంత్రి సిబ్బంది దాడికి దిగడం.. మొత్తం కార్యక్రమం గందరగోళం కావడం తాజాగా ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది.  

విషయానికి వస్తే.. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ  సమన్వయ కమిటీ సమావేశం ఒంగోలులో జరిగింది.  ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా టీడీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి , జిల్లా ఇంచార్జ్ మంత్రి రావెల కిషోర్ బాబు ,మంత్రి  శిద్ధా రాఘవరావు తోపాటు జిల్లాలోని అన్నీ నియోజకవర్గ భాద్యులు , పార్టీ ఎమ్మెల్యేలు ,జిల్లా తేదేపా 
ముఖ్యనాయకులు వచ్చారు.



జిల్లా లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు కొత్తగా పార్టీలో చేరిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాల గురించి చర్చించారు. చీరాల నియోజకవర్గంలోని పార్టీ అంతర్గత సమస్యలను రావెలకు తెలుపుదామని వెళ్తున్న సమయంలో పోతుల సునీత అనుచరులకు, రావెల అనుచరులకు మధ్వ గొడవ జరిగింది.

మంత్రి తమ సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ కార్యకర్తలు మంత్రి రావెల కిషోర్ బాబును అడ్డుకున్నారు. దీంతో కోపగించిన మంత్రి రావెల అనుచరులు ఓ కార్యకర్తను చితకబాదారు. దీంతో పార్టీ సమావేశం కాస్తా రసాభాసగా ముగిసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: