వైసీపీ ఆ మధ్య గడపగడపకూ వైసీపీ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించింది. నాలుగైదు నెలల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఆ జోరు పెద్దగా కనిపించడం లేదు. అనుకున్నంతగా ఈ కార్యక్రమం విజయవంతం కాలేదు.

ఇందుకు కారణాలేంటో తెలుసా... వైసీపీ నాయకులు గడపగడపకూ వెళ్తుంటే జనం తిడుతున్నారట. జనం తిట్లు తట్టుకోలేక వైసీపీ నాయకులు గడపగడపకూ వైసీపీ కార్యక్రమం ఆపేశారట. ఈ సంగతి చెప్పిందేవరో తెలుసా.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయవాడ పశ్చిమనియోజికవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్...


కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఓ సామెత. అలాగే జలీల్ ఖాన్ కూడా వైసీపీ నుంచి వచ్చాక ఆ పార్టీ బాగా విమర్శించడం మొదలు పెట్టారు. అందుకే కొన్ని కామెడీ డైలాగులు కొడుతున్నారు. ఏపీలోని ప్రతిపక్షాలకు ప్రభుత్వంలో ఏ తప్పు కనిపించక తలలు పట్టుకుంటున్నారట. 

అటు జగన్ మాత్రం రాష్ట్రంలో ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయో ఓదార్పు చేద్దామా అని చూస్తున్నారట. ఈ మాట కూడా జలీల్ ఖానే అన్నాడు. తాను విజయవాడ అభివృద్దికి కట్టుబడి పని చేస్తానని చెప్పుకొచ్చాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: