ఈ మద్య కొంత మంది అధికారంలో ఉంటే తామేది చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకోవడం అది కాస్త సోషల్ మీడియాలో హల్ చల్ కావడం కామన్ అయ్యాయి. ఆ మద్య ఓ మంత్రి తన చెప్పులు ఓ అధికారి చే మోయించడం పెద్ద సంచలనం రేకెత్తించింది. భారత దేశంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.  ఇక ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా కలెక్టర్ షమ్మీ అబీదీ పేరు వింటే అందరికీ హడల్. నిజాయితీకి మారు పేరు అయిన ఆమె ప్రజలు కష్టాల్లో ఉంటే ఎక్కడికైనా వెళ్లి సమస్యలు పరిష్కరించాలని చూస్తుంది. అధికారులు సైతం  అడుగుపెట్టని గ్రామాల్లోకి  కలెక్టర్ అయిన ఆమె స్వయంగా వెళ్లి సమస్యలు తెలుసుకుంటారు.  

తాజాగా ఆమె చేసిన పని చూస్తుంటే నిజంగానే కలెక్టరమ్మా మజాకా అని అనుకుంటున్నారు.  ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో సొమవారం మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. బురద ఎక్కువగా ఉండటంతో ఆమె చెప్పులు లేకుండానే ఆ ప్రాంతంలో కలియదిరిగారు. అంతా బాగానే ఉంది కానీ షమ్మీ అబీదీ చేసిన చిన్న పోరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే బురుదలో చెప్పులు వేసుకొని తిరగలేక ఆ చెప్పులు కాస్త పక్కనే ఉన్న బాడీగార్డు కి అప్పజెప్పడం. ఇలాంటి ఘటనలతో ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో టాం..టాం కావడం ఇప్పుడు ఈ వంతు షమ్మీ అబీదీ కు రావడంపై అనేక మంది విమర్శిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: