కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఏటా జరుపుకునే 'కార్గిల్ విజయ దివస్' సందర్భంగా అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నివాళులర్పించారు. వీరజవాన్ల సేవలను కొనియాడారు. చిట్టచివరి శ్వాస వరకూ దేశం కోసమే పోరాడి అమరులైన సాహస సవాన్ల సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తించుకుటుందని, వారి వీరోచిత త్యాగాలు అందిరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. 



భారత సైన్యం... పాక్‌ సేనలకు మరిచిపోలేని రీతిలో బుద్ధి చెప్పిందన్న మోదీ.. నాటి రాజకీయ నాయకత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్ని కొనియాడారు. భారత్‌లో పాక్‌ సైనికులు చొరబడేందుకు ప్రయత్నించడంతో.. 1999 మే నెలలో ఇరు దేశాల మధ్య కార్గిల్‌ యుద్ధం జరిగింది. జులై 26న ముగిసిన ఈ యుద్ధంలో పాక్‌పై భారత సైనికులు ఘన విజయం సాధించడంతో ఈ రోజును కార్గిల్‌ విజయ్‌ దివస్‌గా పేర్కొన్నారు. బీజేపీ అగ్రనేత వాజ్‌పేయి నేతృత్వంలోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. కార్గిల్ యుద్ధం సందర్భంగా వాజ్ పేయి వ్యవహరించిన తీరును ఆయన కొనియాడారు.



మరింత సమాచారం తెలుసుకోండి: