ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం ఎంత పనికైనా సిద్దపడుతున్నారు. ఇక సొసైటీలో వారసత్వంగా వస్తున్న ఆస్తులు అనుభవిస్తూ ఎంజాయ్ చేసేవారు కొందరైతే అక్రమంగా డబ్బు సంపాదించి ఎంజాయ్ మెంట్ చేసేవారు మరికొందరు.  అయితే ఇలా ఎంజాయ్ చేయడానికి వారు ఎన్నుకొనే మార్గాలు చూస్తుంటే సభ్య సమాజం తల దించుకోవాల్సి వస్తుంది. కొంత మంది నిస్సిగ్గుగా పరువూ మర్యాదలు వదిలేసి వ్యభిచారం చేస్తూ...చేయిస్తూ అడ్డగొలు డబ్బు సంపాదిస్తున్నారు. వీటి కోసం వారు కొన్ని అపార్టు మెంట్లు, బ్యూటీ పార్లర్, మసాజ్ సెంటర్ లాంటివి నిర్వహిస్తూ వాటి వెనుక కొంత మంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఇలాంటివి కొంత మంది బడా బాబులు కొన్ని రీసార్ట్ లాంటివి నిర్వహిస్తూ అక్కడ కూడా అందమైన అమ్మాయిలను రప్పించి డబ్బును కుర్రాళ్లను ఆకర్షించి వాళ్లను నిండా ముంచుతున్నారు.

ఇక  కొంత మంది రేవ్ పార్టీలు నడిపిస్తూ యువతీ యువకులను మత్తులో ముంచి వారి నుంచి డబ్బులు లాగుతున్నారు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఇలాంటివి ఈ మద్య కామన్ అయ్యాయి..అయితే వీటిని అరికట్టాల్సిన పోలీసులు కొన్ని సార్లు చూసీ చూడనట్లు వ్యవహరించడం వారికి బాగా కలిసి వస్తుంది.తాజాగా ఆంధ్రప్రదేశ్ లో  కోనసీమలోని రిసార్ట్స్ లో సెక్స్ రాకెట్ గుట్టు బయట పడింది. టూరిజం పేరుతో రిసార్ట్స్ అభివృద్ధి చేస్తుంటే మరోవైపు కొందరు స్వార్థ పరులు వీటిని క్యాష్ చేసుకుంటున్నారు.

ఓడరేవు వంటి చోట్ల విచ్చలవిడిగా అమ్మాయిలతో ఈ దందా కొనసాగుతున్నా పట్టించుకుంటున్న నాథుడే లేడని స్థానికులు బాధపడుతున్నారు. తమ దగ్గరకు వచ్చిన కస్టమర్లను పోలీసు బారి నుంచి ఎలా కాపాడుతారో..పోలీసులు తమ వద్ద ఎలా ఉంటారో అక్కడి నిర్వాహకుడు చెబుతుంటే అశ్చర్యం వేస్తుంది. ఏది ఏమైనా  డబ్బు సంపాదించడమే పరవాధిగా పెట్టుకున్న కొంత మంది స్వార్థపరులు చేసే పనివల్ల టూరిజం పేరు వింటేనే కొన్ని కుటుంబాలు వ్యతిరేకించే పరిస్థితి తీసుకు వస్తున్నారు. ఇలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు పోలీసులను కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: