తమిళనాడు రాష్ట్రంలోని సాంప్రదాయక క్రీడ ‘జల్లికట్టు’పై నిషేధం ఎత్తివేతకు సుప్రీంకోర్టు మరోసారి ‘నో’ చెప్పింది. ఆ క్రీడపై నిషేధం ఎత్తి వేసేందుకు నిరాకరించింది. ‘జల్లికట్టు’ నిషేధంపై స్టే విధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. కాగా, ప్రతి ఏడాది సంక్రాంతి పండగ మరుసటి రోజున జరిపే ఈ క్రీడపై 2011లో యూపీఏ ప్రభుత్వం నిషేధం విధించింది. 



ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ ఈ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేసింది. టా పొంగల్ (తెలుగువారికి సంక్రాంతి) పండుగ మరుసటి రోజున జరిపే ఈ క్రీడపై 2011లో యూపీఏ ప్రభుత్వం నిషేధం విధించింది. జంతువుల పట్ల హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంది. అయితే జల్లికట్టుపై నిషేధాన్ని ఎన్డీయే ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించే ఎడ్ల బండ్ల పందాలకూ షరతులతో అనుమతినిచ్చింది. కేంద్రం నిర్ణయంపై పలువురు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ


జల్లికట్టు 5వేల ఏళ్ల క్రితం నాటి సంప్రదాయ ఆట కావొచ్చు.. కానీ అది ఆడడం చట్టపరంగా సరైనదా, కాదా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు వెల్లడించింది. జల్లికట్టుకు వేల ఏళ్ల చరిత్ర ఉండొచ్చు.. అయితే ఏంటి? చట్టపరంగానే ముందుకెళ్తామని స్పష్టంచేసింది. జల్లికట్టు వేల ఏళ్లనాటి సంప్రదాయ ఆట కనుక దాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు వేసిన పిటిషన్‌ను కోర్టు తీవ్రంగా ఖండించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: