ఒకనాడు అంటే సహస్రాబ్ధాలకు పూర్వం నుండీ సతీసగమనం ఒక అచారం. బాల్యవివాహాం ఒక సాంప్రదాయం. జంతు బలి ఒక పారంపర. కాని ఇవన్నీ  కాలక్రమేణా  క్రమంగా నిషేదించబడ్డాయి లేక ప్రజల్లో వచ్చిన మార్పులతొనే అంతరించి పోయాయి. ఒకనాటి శతసహస్రాబ్ధాల సాంప్రదాయాలు, పారంపర్యంగా వస్తున్న ఆచారాలు అంతరించాయి. అవన్నీ ముగిసిపోయిన ఘట్టాలు.  విధవా పునర్వివాహాలు , వరకట్న దురాచారాలు, స్త్రీలు వంటింటి కి లేదా ఇంటివాకిలి వరకే పరిమితం చేసే అనాచారాలు అంతరించిపోలేదా?


తమిళనాడు లో 5000 సంవత్సరాల నుండి ఆచార వ్యవహారాలలో కలిసిపోయిన జల్లికట్టు సాంప్రదాయం నేడు జంతు హింస క్రింద వస్తుంది. అంతేకాదు ఈ బుల్-ఫైట్లో వందలాది యువకులు మరణించారు. ఒకరకంగా చెప్పాలంటే అరబ్ ఎడారుల్లో పసివాళ్ళని ఒంటెలకు కట్టి పరుగెత్తించే ఆ పసివాళ్ళు భయం తో చేసే ఆర్తనాధాలు  — ఒక రాక్షస క్రీడ లాంటిదే. ఒక కౄరసాంప్రదాయమే. ఒకనాటి కాలములో దళితులను అంటరానివాళ్ళుగా చూసే సాంప్రదాయముంది. మరి అది ఇప్పుడులేదే. కాలం కొనసాగే కేమంలో కొన్ని మంచి, కొన్ని చెడు సాంప్రదాయాలు సమాజములో వచ్చిచేరతాయి. సాంప్రదాయముంది కదా అని దుష్ఠ సాంప్రదాయమని సమాజం భావించేటప్పుడు దాన్ని కొనసాగించే అవసరమే లేదు.


అసలు మానవత్వం, సంస్కారమున్న మానవులెవరూ ఈ తమిళనాట జల్లికట్టు సాంప్రదాయాన్ని అనుమతించరు. అలాంటిదే ఆంధ్ర ప్రదేశ్ లోని కోడిపందాలు. వీటిని కూడా నిషేదించినా రాజకీయనాయకులు, పోలీసులు సహకారముతో చిరస్థాయిగా వర్దిల్లటమే కాదు బెట్టింగ్ అనే కొత్త జూదం దీనికి తోడై అనేక బ్రతుకులు ఆహుతైపోతున్నాయి.  ఇవన్నీ ఒకనాటి రాజరిక సాంప్రదాయాలు. రాచరిక, భూస్వామ్య, జమీందారి వ్యవస్థల కౄర క్రీడలనుండి వినొదంపొందే రాక్షస లక్షణాల అవశేషాలే ఇవి. ఒక ప్రాణి భయానకమైన చావును అత్యంత కౄరంగా చూస్తూ రాక్షసానందం పొందే ఇలాంటి సాంప్రదాయాలను తొలగిస్తే లేదా నిషేదిస్తే సమాజానికి మేలే గాని కీడు జరగదు.


వేలయేళ్ళ నాటి అనాచారాలను కొనసాగించవలసిన అవసరమేముంది. మంచిది కాదని సమాజం భావిస్తే చట్టం సమ్మతిస్తే దాన్ని కొనసాగించటం ప్రభుత్వధర్మం కాకూడదు. 2011 లో యు.పి.ఏ. ప్రభుత్వం ఒక రాజకీయ అవసరానికి ఈ అనాచారాన్ని నిషేదించింది. తరవాత అధికారంలోకి వచ్చిన ఎన్.డి.ఏ ప్రభుత్వం మరో రాజకీయ స్వలాభేక్ష తో నిషేదం ఎత్తివేసింది.  రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓట్లకోసమే ఈ దురాచారాన్ని కొనసాగిస్తున్నారు. జంతు సం-రక్షణ సంఘాలు కోరినట్లు జంతువులూ ప్రాణులే. ఆ పెంపుడు జంతువులు మనతో కలసి మెలసి జీవించాలి. జంతు-వృక్ష సమతౌల్యం వాతావరణానికి మానవ జీవనం ప్రశాంతముగా కొనసాగ టానికి చాలా అవసరం.  భారత సర్వోన్నత న్యాయస్థానం మరల దాన్నే పునరుద్ఘాటించింది.


శతాబ్ధాలకు పూర్వం విడాకుల సాంప్రదాయమేలేదు. ఇప్పుడు అది చట్టబద్దం కాలేదా? లివిన్-రిలేషన్ షిప్ (పెళ్ళి కాకుండానే అవివాహితులు కలసి సహజీవనం చేయటం) అనేది ఇప్పటి సమాజములో కనిపిస్తింది. ఒక రెండు కాదు ఒక దశాబ్ధం పూర్వం ఇలాంటి అవసరాన్ని ఎవరూ ఊహించలేదు. ఇలాంటిదప్పుడు అనాచారమే. కాని దాన్ని చట్టం ఇప్పుడు అంగీకరిస్తుంది.  కాబట్టి 5000 యేళ్ళ నాటి దరిద్రాన్ని వికృత క్రీడని ఇప్పుడు చట్టం అనుమతించనందుకు సుప్రీం కోర్ట్ సర్వదా అభినందనీయం. హాట్స్-అప్ టూ అవర్ సుప్రీం కోర్ట్.


మరింత సమాచారం తెలుసుకోండి: