ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. లోటుబడ్జెట్, రాజధాని కొరత వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. తన కాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇంతలోనే మరో రాష్ట్ర విభజన ఉద్యమం తప్పదంటున్నారు కొందరు రాజకీయ నాయకులు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 3 ప్రధాన ప్రాంతాల సమ్మేళనం. కోస్తా, రాయలసీమ, తెలంగాణ.. ఇప్పుడు తెలంగాణ విడిపోయింది. కానీ కోస్తా, రాయలసీమ కలిసే ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య విబేధాలు ముదిరితే మరోసారి విభజన ఉద్యమం వస్తుంది. ఇప్పటికే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వంటి వారు ప్ర్తత్యేక రాయలసీమ ఉద్యమం ప్రారంభించారు కూడా. 

గతంలో అన్నీ హైదరాబాద్ లోనే అంటూ సకల సౌకర్యాలను హైదరాబాద్ కు పరిమితం చేసిన చంద్రబాబు.. మరోసారి అదే తప్పుచేస్తున్నారన్నవాదన వినిపిస్తోంది. ఇప్పుడు అన్ని సౌకర్యాలు అమరావతికే పరిమితం చేయడం వల్ల రాయలసీమ వాసుల్లో అసంతృప్తి తలెత్తుతోంది. కనీసం హైకోర్టునైనా రాయలసీమలో ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. 


ఏ రాష్ట్రానికైనా రాజదాని, హైకోర్టు రెండు కళ్ల వంటివని.. వీటిలో కోస్తాలో ఒకటి ఏర్పాటు చేస్తే రెండోది రాయలసీమలో ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఇది తాను కొత్తగా చెబుతున్నది కాదని.. 1937 లోనే ఈ మేరకు అవగాహన ఉందని గుర్తు చేస్తున్నారు. అనేక రాష్ట్రాలలో రాజదాని, హైకోర్టులు వేర్వేరు చోట్ల ఉన్న విషయాన్ని తులసి రెడ్డి ప్రస్తావించారు.

1953 లోనూ రాజధాని కర్నూలులో ఏర్పడితే హైకోర్టు గుంటూరులో నెలకొల్పారని ఆయన గుర్తు చేశారు. యూపీ, కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలలో అసెంబ్లీ, హైకోర్టు వేరువేరుగా ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో వెళ్లాలని తులసి రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: