ఆంధ్రప్రదేశలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన నుంచి వెలికితీస్తున్న సహజవాయువును తొలుత రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని, ఆ తర్వాతే బయటకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.ఆధార్‌ అనుసంధానంతో త్వరలో రాష్ట్రంలోని ఏ చౌకదుకాణాల్లోనైనా సరకులు తీసుకునేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. గంటల తరబడి లైనులో నిలబడే కష్టాలకు సైతం స్వస్తిపలికేలా ఆలోచన చేస్తున్నాం. రేషన్‌ డీలర్ల కమీషన్‌ను రూ.20 నుంచి రూ.70కు పెంచాం. దీనివల్ల ప్రభుత్వంపై రూ.77.44 కోట్లు అదనపు భారం పడుతుంది. లబ్ధిదారులతో అమర్యాదగా ప్రవర్తించినా, అవమానించినా కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ల తీరుపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుంటాం.



ఇందులో కేజీ బేసిన గ్యాస్‌, పుష్కరాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత సంస్థలు, ఎరువుల కర్మాగారాలు, ఫెర్రో అల్లాయిస్‌ యూనిట్లు ఉండగా వాటికివ్వకుండా ఇతర రాషా్ట్రలకు గ్యాస్‌ తీసుకెళ్తున్నారని, దీని వల్ల ఇక్కడ ఉత్పత్తి దెబ్బతింటోందని సీఎం చెప్పారు. తాను ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానను కలిసినప్పుడు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పానని తెలిపారు. కాదూ కూడదంటే పైపులైన్ల నుంచి గ్యాస్‌ పోనివ్వబోమని కూడా చెప్పానని ఆయన చమత్కరించారు. ఈ విషయంపై రాష్ట్రం గట్టి పట్టుదలతో ఉందని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుంటామని చెప్పారు.



నెల్లూరు జిల్లా తడాలో 12.07 ఎకరాలు ఇండస్ట్రియల్‌ పార్కు కోసం ఎకరాకు రూ.లక్ష విలువ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. విశాఖ జిల్లా పెదగంట్యాడ గ్రామంలో నడుకూరు గ్రామంలో 204.46 ఎకరాలు మెడికల్‌ టెక్నాలజీ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్కు ఏర్పాటు కోసం వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించాం. అనంతపురంలో జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామంలో 16.55 ఎకరాలు ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ కోసం ఏపీఐఐసీకి కేటాయించాం. చిత్తూరు జిల్లా తొట్టెంబేడు మండలం తాటిపర్తి గ్రామంలో 315.79 ఎకరాలు, అనంతపురం జిల్లా హిందూపూర్‌లో కోటిపీ గ్రామంలో 77.01 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్‌ పార్కు కోసం ఏపీఐఐసీకి కేటాయించాం.  



కృష్ణా పుష్కరాలకు కేంద్రం ఈసారి నిధులు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుడు గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు ఇచ్చిందని, ఈసారి పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు. పుష్కరాలు జాతీయ ప్రాధాన్యం కలిగిన ఆంశమైనప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కృష్ణా పుష్కరాల్లో కొన్ని పనులు నామినేషన ద్వారా ఇవ్వడంపై సీఎం అధికారులకు క్లాస్‌ తీసుకున్నారు. 



మంత్రుల్లో ఎంత మంది ఫేస్‌బుక్‌ ఖాతాలు ఉన్నాయనేదానిపైనా చర్చ జరిగింది. తామందరికీ ఖాతాలున్నాయని మంత్రులందరూ చెప్పారు. వాటిలో క్రమం తప్పకుండా రోజూ పోస్టింగులు పెడుతున్నవారెందరు అని అడిగినప్పుడు తాము పెడుతున్నామని మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు తెలిపారు. వారి ఫేస్‌బుక్‌ ఖాతాలను ఎంత మంది అనుసరిస్తున్నారని సీఎం అడిగినప్పుడు తన ఖాతా 70వేల మందని గంటా చెప్పగా, తన ఖాతాకు 50 వేల మంది ఫాలోయింగ్‌ ఉందని అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రస్తుతం యువతరం ఫేస్‌బుక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారని, మంత్రులు ఆ మాధ్యమంలో చురుకుగా ఉండి.. యువతకు చేరువ కావాలని సీఎం సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: