లేచామా.. తిన్నామా.. తెల్లారిందా... ఇదీ మన జీవితం.. ఇల్లు, పెళ్లాం.. ఉద్యోగం.. ఇంతకు మించి వేరే ఆలోచనలేని జీవులు లోకంలో ఎంతో మంది. కానీ సమాజంలోని అన్యాయాన్ని, అణగారిన వర్గాలను, వారి బాగోగుల కోసం తపించేవారు ఎంత మంది. నూటికో కోటికో ఒక్కరు. 

అలాంటి వారే తాజాగా రామన్ మెగసేసే అవార్డు అందుకున్న బెజవాడ విల్సన్, టీఎం కృష్ణన్.. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికిచ్చే ఆసియా అత్యున్నత పౌర పురస్కారం రామన్  మెగసెసే అవార్డుకు ఈ ఏడాది ఈ ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఇద్దరూ అంతిమంగా బడుగుల కోసమే తమ జీవితాలను అంకితం చేశారు. 

Magsaysay Award winners Bezwada Wilson (left) and T.M. Krishna. Photo: Ramon Magsaysay Award Foundation


బెజవాడ విల్సన్ గురించి చెప్పాలంటే.. మానవ మలమూత్రాలను మనుషులతో ఎత్తిపోయించే వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన ఉద్యమిస్తున్నారు. కర్ణాటకలోని కోలార్  బంగారు గనుల టౌన్ షిప్ లో దళిత కుటుంబంలో పుట్టారు. ఆయన కుటుంబం కూడా మానవ విసర్జితాలను తొలిగించే పనే చేసేది. చదువుకునే సమయంలో దళితుడనే వివక్షకు గురైన విల్సన్ ఈ అమానవీయ వృత్తిని రూపుమాపేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. 

ఇక టీఎం కృష్ణన్ ది మరో విభిన్న నేపథ్యం. కర్ణాటక సంగీతంలో సామాజిక నేపథ్యాన్ని చొప్పించి విశేష జనాదరణ పొందుతున్నారీయన. చెన్నైకు చెందిన TM కృష్ణన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆరో ఏట నుంచే కర్ణాటక సంగీతాన్నిఅభ్యసించారు. ఆ తర్వాత సంగీతం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాకూడదన్న లక్ష్యంతో చెన్నైలోని మురికివాడల్లోనూ సంగీత కచేరీలు నిర్వహించి కొత్త సామాజిక రాగాలు ఆలపించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: