వాళ్లు.. ఆంధ్రా అమ్మాయిలు.. కడప జిల్లా అమ్మాయిలు.. పేదరికంలో మగ్గుతున్న దళిత బాలికలు.. మాయమాటలకు లొగిపోయే.. పేదరికం తాళలేకనో.. దళారుల మాయాజాలం వల్లనో రెడ్ లైట్ ఏరియాకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. తమిళనాడులోని వేరువేరు నగరాల్లో వీరితో వ్యాపారం చేద్దామనుకున్నారు బ్రోకర్లు.. 

కానీ.. ఓ స్వచ్ఛంద సంస్థ వీరి విషయం పసిగట్టింది. వేశ్యాకూపంలో ఇరుక్కుపోబోయిన దాదాపు 15 మంది జీవితాలను కాపాడింది. కడప రైల్వేస్టేషన్‌ నుంచి వేశ్యావృత్తిలోకి వెళ్లపోబోయిన  15 మంది  బాలికలను ఐసీడిఎస్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. 


కడప రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉన్న అమ్మాయిలను గుర్తించిన భారతరత్న మహిళా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు విషయాన్ని ఐసీడిఎస్‌ అధికారులకు సమాచారం అందించారు. వీరిని బద్వేల్‌ నుంచే వెంబడిస్తూ వచ్చిన ఇండియన్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం వెంటనే సమాచారాన్ని అధికారులకు, పోలీసులకు అందించారు.

ఘటనాస్థలానికి పోలీసులతో చేరుకున్న అధికారులు...రైలు ఎక్కేందుకు సిద్దంగా ఉన్న బాలికలను గుర్తించి పట్టుకున్నారు. వారితో పాటు ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదులోకి తీసుకున్నారు. అమ్మాయిలు చెప్పే దానికి... దళారులు చెబుతున్న దానికి పొంతన లేకపోవడం వల్ల అనుమానించి.. బాలికలను బాలసదన్‌కు తరలించారు. వారితో పాటు ఉన్న వ్యక్తులను ఒకటో పట్టణ పోలీసులు స్టేషన్‌కు తరలించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: