కేవీపీ రామచంద్రరావు.. ఈయనో ఆంధ్రా ఎంపీ.. ఎంపీ అంటే రాజకీయ నాయకుడేగా.. కానీ ఈయన ఎన్నడూ జనంలో తిరిగింది లేదు. ప్రజాసమస్యలపై పోరాడిన చరిత్రా లేదు. కానీ ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అపురూపు స్నేహమే ఆయన్ను రాజకీయ నాయకుడిని చేసింది. రాజ్యసభ సభ్యుడిని చేసింది. 

వైఎస్ మరణం తర్వాత ఈయన ప్రభ బాగా తగ్గిపోయింది. జగన్ తోనూ పొరపొచ్చాలు వచ్చి ఈయన కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అలాంటి కేవీపీ ఇప్పుడు ఒక్కసారిగా ఏపీలో హాట్ టాపిక్ అయ్యారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో దాగుడు మూతలు ఆడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్క ప్రైవేటు మెంబర్ బిల్లు అనే అస్త్రంతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. 


ఈ బిల్లును అడ్డుకునేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. ఉపసంహరించుకోమని చెప్పింది. ద్రవ్యబిల్లు రాజ్యసభలో పెట్టకూడదని వాదించింది. ఏదేమైనా ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. బీజేపీ తన వాదన వినిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఆ పార్టీను కేవీపీ బోనులో నిలబెట్టారు. 

ఈ అంశంలో పార్టీలకు అతీతంగా కేవీపీ రామచంద్రరావుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రవేటు మెంబర్ బిల్లుతో ప్రత్యేక హోదా వస్తుందన్న ఆశ ఎవరికీ లేదు. కానీ కనీసం.. ఈ విషయంలో బీజేపీ సర్కారు తన మనసులో మాట అయినా చెబుతుంది. ఇన్నాళ్లూ ఆడిన దాగుడు మూతలకు ఫుల్ స్టాప్ పడుతుంది. 

రాజ్యసభ సాక్షిగా ఏపీ విషయంలో జరిగిన అన్యాయం ప్రపంచానికి తెలుస్తోంది. ఇదంతా కేవలం ఒక్కే కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లు వల్లే సాధ్యమైందన్న వాదన వినిపిస్తోంది. అందుకే ఏపీలో ఆయన పొలిటికల్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: