ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడాలేని స్వేచ్చా విధానం మన దేశం పౌరులకు కల్పించింది. మన దేశంలో  ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. మన దేశం సాంప్రదాయ దేశంగా విరాజిల్లుతున్న విషయం అందిరికీ విదితమే. అయితే మన సంప్రదాయాల్ని, నమ్మకాల్ని, విశ్వాసాల్ని, మూడ నమ్మకాలపై ఆధారపడే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఇందులో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తారు బాబాలు. ప్రస్తుతం దేశంలో ఎంతో మంది బాబాలుగా చెలామణి అవుతున్నారనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ బాబాలలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క స్టైల్. 

golden-baba


ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రజలను బురిడీ కొట్టించి డబ్బును సంపాదిస్తున్నారనే విషయం కూడా అందరికీ విదితమే. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోల్డెన్ బాబా స్టైలే వేరు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కన్వర్ యాత్రను చేపట్టిన గోల్డెన్ బాబాను చూసి ప్రజలు దృష్టి మరల్చుకోలేకపోయారు. ఆయన చేసే మహిమలు చూసి అనుకుంటే పొరపాటే. ఒంటి నిండా రూ.4 కోట్ల విలువైన 12 కేజీల బంగారు ఆభరణాలు ధరించి, విలాసవంతమైన ఫార్చ్యూన్ వాహనంపై ఊరేగుతుంటే నాస్తికుడైనా అలాగే చూస్తుండి పోవాల్సిందే. 



అంగరంగ వైభవంగా ఈ గోల్డెన్ బాబా కన్వర్‌యాత్రను చేపట్టడం ఇది 24సారి. హరిద్వార్ నుంచి ఢిల్లీలోని గాంధీనగర్ ఆశ్రమం వరకు చేపట్టే ఈ యాత్ర కోసం గతేడాది రూ.72 లక్షలు ఖర్చు చేయగా ఈ ఏడాది కోటి రూపాయలు కేటాయించారు. ఈ బంగారు బాబా యాత్రలో ఆయన వెంట కనీసం 200 మంది ప్రజలు, పదిమంది అంగరక్షకులు ఉండాల్సిందే. వాహనంలో అంగరక్షకులు కూర్చొని ఉంటే టాప్‌పై ఎల్లవేళలా పోలీసులు తుపాకులు పట్టుకొని గస్తీ కాయాల్సిందే. తొలి యాత్ర సమయంలో 5 కేజీల బంగారు ఆభరణాలు ధరించిన ఈ స్వామి ఒంటిపై కనక సంపద ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తున్నది. పైవాడు (భగవంతుడు) అంతా ఇస్తున్నాడు చెప్పుకొనే ఈయన .. బంగారు ఆభరణాలు ధరించడం లక్ష్మీదేవీ కరుణ కటాక్షాలకు గుర్తు అని చెప్పడం ఓ విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: