తమిళనాడులో ఆ మద్య జరిగిన ఎన్నికల్లో కెప్టెన్ విజయ్ కాంత్ ఘోరంగా పరాజయం పొందిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు లో సీఎం జయలలితకు  సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  ఆ మద్య విజయ్ కాంత్ తన ప్రభుత్వాన్ని వివమర్శించరాని డీఎండీకే అధినేత విజయకాంత్‌పై వేసిన అన్నాడీఎంకే తరపున న్యాయవాది ఒకరు దావాలో దిగువ కోర్టు జారీచేసిన నాన్ బెయిలబుల్ వారంట్ల అమలును గురువారం సుప్రీంకోర్టు నిలిపేసింది.  ఈ నేపథ్యంలో డీఎండీకే అధినేత విజయకాంత్‌పై వేసిన దావాలో దిగువ కోర్టు జారీచేసిన నాన్ బెయిలబుల్ వారంట్ల అమలును గురువారం సుప్రీంకోర్టు నిలిపేసింది. రాజకీయ ప్రత్యర్థులపై పరువునష్టం దావాలను ఒక ఆయుధంగా వినియోగించుకోరాదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హితవు చెప్పింది.  
Jayalalitha
కాగా అసమ్మతి గొంతు నొక్కరాదని, ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించేవారిపై ఐపీసీలోని 499,500 సెక్షన్ల కింద పరువు నష్టం కేసులు పెట్టడం కలవరపరిచే అంశమని వ్యాఖ్యానించింది. డీఎండీకే అధినేత విజయకాంత్ దంపతులు 2005 నవంబర్‌లో జయలలిత ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నదని ఆరోపించారు. ఈ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో స్థానికకోర్టు విజయకాంత్ దంపతులపై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది.

దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం స్టే విధించింది. విజయకాంత్ దంపతులపై కింది కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. రాజకీయ ప్రత్యర్థులపై పరువునష్టం దావాలను ఒక ఆయుధంగా వినియోగించుకోరాదని ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వానికి హితవు పలికింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: