పాక్ ఆక్రమిత కాశ్మీర్.. ఇది పాకిస్థాన్ భారత్ నుంచి ఆక్రమించుకున్న ప్రాంతం. దీన్ని ఎప్పటికైనా స్వాధీనం చేసుకోవాలన్నది భారత్ కల. ఈ ప్రాంతంపై పట్టు సాధించి పాకిస్థాన్ లో కలిపేసుకోవాలన్నది పాకిస్థాన్ ఆలోచన. స్వతహాగా పాక్ పట్టు ఎక్కువ ఉండే ఆక్రమిత పాకిస్తాన్ లో ఇప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. 

ఇటీవల ఆక్రమిత కాశ్మీర్ లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ పాక్  ప్రధాని నవాజ్  షరీఫ్  పార్టీ ముస్లిం లీగ్ కు మంచి మెజార్టీ వచ్చింది. మొత్తం 41 స్థానాల్లో 32 స్థానాలు ఆ పార్టీ గెలుచుకుంది. ఐతే.. ఇదంతా రిగ్గింగ్ పుణ్యమేనని స్థానికులు మండిపడుతున్నారు. దీనికి తోడు స్థానిక పార్టీ అయిన ముస్లిం కాన్ఫరెన్స్ కార్యకర్త ఒకరి హత్య ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అట్టుడికిస్తోంది. 


నవాజ్  షరీఫ్  పార్టీకి చెందిన వారే ఆ కార్యకర్తను హత్య చేశారన్నది స్థానికుల వాదన. వారి ఆక్రోశం క్రమంగా ఉద్యమరూపుదాలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రధాన పట్టణాలైన ముజఫరాబాద్ , కోట్లీ, చినారీ, మిర్ పూర్  అల్లర్లతో అట్టుడుకుతున్నాయి. 

నవాజ్ షరీఫ్ పార్టీ భారీగా ఓట్లకు డబ్బు పంచిందని.. లోకల్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. పాక్ గూడఛారి సంస్థ ఐఎస్ ఐ కూడా నవాజ్ షరీఫ్ పార్టీకి అనుకూలంగా పనిచేసిందని మండిపడుతున్నారు. ఆ ఆందోళనలు తీవ్రస్థాయికి వెళ్లి ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్ లో పాక్ జెండాను తగలబెట్టే వరకూ పరిస్థితి వెళ్లింది. ఈ అనూహ్య పరిణామాలతో నవాజ్ షరీఫ్ అవాక్కవుతున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: